News June 13, 2024

ఎర్రన్నాయుడు కుటుంబానికి CBN ప్రాధాన్యం

image

దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ TDP అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భవాని సైతం MLAగా పనిచేశారు.

News June 13, 2024

న్యూజిలాండ్‌కు షాక్.. సూపర్-8కు చేరిన విండీస్

image

టీ20WC: NZపై వెస్టిండీస్ విజయం సాధించింది. ఆ జట్టు 13 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 136/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), అలెన్ (26) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, మోతీ 3 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు రూథర్‌ఫర్డ్ (68) వీరవిహారంతో విండీస్ 149/9 పరుగులు చేసింది. ఈ విజయంతో WI సూపర్-8కి చేరగా, NZకు బెర్త్ కష్టంగా మారింది.

News June 13, 2024

నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో తిరుపతి నుంచి బయల్దేరి ఉ.11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్లి దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. సా.4.41 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. మెగా డీఎస్సీ సహా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు.

News June 13, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కొమురం భీం, MNCL, JGL, SDPT, సంగారెడ్డి, గద్వాల, WNP, నారాయణ పేట, PDPL, KNR, BPL, SRCL, MDK, MHBR, HMK, NGKL, WGL జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఏపీలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

News June 13, 2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?

image

AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

News June 13, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని TGPSC విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఈనెల 17 వరకు స్వీకరించనుంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ను సందర్శించండి.

News June 13, 2024

సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్

image

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘న్యూయార్క్ పిచ్‌పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్‌పైన 110+ స్కోరైనా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. సూర్య, దూబే రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్‌ దశలో మూడు మ్యాచుల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో ఆడతాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

News June 13, 2024

ఇండియా నా జన్మభూమి.. అమెరికా నా కర్మభూమి: నేత్రావల్కర్

image

తాను ఎప్పటికీ భారతీయుడినేనని యూఎస్ఏ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నారు. ‘ఇండియా నా జన్మభూమి.. అమెరికా నా కర్మభూమి. ఈ రెండు దేశాలంటే నాకు గౌరవం. ఈ విషయం నాకు గొప్ప అనుభూతి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నేత్రావల్కర్ ఔట్ చేశారు. వికెట్లు తీసిన సందర్భంగా ఆయన సంబరాలు అంబరాన్నంటాయి.

News June 13, 2024

బస్సు టికెట్ ధరలు పెరిగాయా? లేదా?.. అసలు విషయం ఇది!!

image

TGSRTC ఛార్జీల పెంపుపై కొందరు ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. కేంద్రం టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామన్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఉన్న నేషనల్ హైవే రూట్లలో పదిరోజుల క్రితమే టికెట్‌పై రూ.3 చొప్పున పెంచారు. దీంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రయాణికులపై భారం పడ్డట్లే.

News June 13, 2024

తిరుమల శ్రీవారి సేవలో సీఎం

image

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఉన్నారు. టీటీడీ జేఈవో గౌతమి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. నిన్న ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.