India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వివాహాలన్నింటిలో బ్రాహ్మమును ధర్మబద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో వధువు తండ్రి తగిన అర్హతలు గల వరుడిని స్వయంగా అన్వేషించి, ఆహ్వానిస్తారు. తన కుమార్తెను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దానం చేస్తారు. ఇది ధర్మ సంయోగానికి ప్రతీక. ఈ దానం ద్వారా వధువు తండ్రి పుణ్యాన్ని పొందుతాడు. వధూవరులు ధార్మిక జీవితాన్ని ప్రారంభించి, సుఖసంతోషాలతో, ఉత్తమ గతులు పొందుతారు. ఇది దైవిక ఆశీస్సులతో కూడిన వివాహ బంధం. <<-se>>#Pendli<<>>

AP: మొంథా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 440KM, విశాఖకు 530KM, కాకినాడకు 490 KMల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో 17KMPHతో కదిలిందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం 4PM నుంచి 11PM మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. ఆ సమయంలో భారీ గాలులు, వర్షాలు కురుస్తాయని వివరించారు.

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్‌పై రాసి ఉన్న కోడ్‌లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది. L ఉంటే 120kmph, N- 140kmph, P- 150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V- 240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్‌ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. SHARE IT

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, డిగ్రీ, ఎండీ(రేడియాలజీ), ఎంబీబీఎస్, డీఎన్‌బీ, బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా(నర్సింగ్), ఇంటర్, DMLT, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.nia.nic.in/

1. హనుమంతుడి గురువు ‘సూర్యభగవానుడు’.
2. వ్యాసుని తల్లి ‘సత్యవతి’.
3. కుబేరుడి వాహనం ‘నరుడు’.
4. కామదహనం జరిగే పండుగ ‘హోళి’.
5. ఇంద్రుని వజ్రాయుధం చేసింది ‘దధీచి మహర్షి’.
<<-se>>Ithihasaluquiz<<>>

AP: వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Sorry, no posts matched your criteria.