News June 11, 2024

సైకిల్ మెకానిక్ TO సెంట్రల్ మినిస్టర్

image

MPకి చెందిన వీరేంద్ర కుమార్ ఖటీక్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చిన్నతనంలో తండ్రి సైకిల్ రిపేర్ షాపులో ఆయన పంక్చర్లు వేసేవారు. దళిత వర్గానికి చెందిన వీరేంద్ర గ్రాడ్యుయేషన్, బాల కార్మికులపై PhD చేశారు. 1996లో తొలిసారిగా LS ఎన్నికల్లో గెలిచిన వీరేంద్ర మళ్లీ వెనుదిరిగి చూడలేదు. తాను సాధారణ కుటుంబ వ్యక్తినని, తన జీవనశైలి ఇప్పటికీ సాధారణంగా ఉంటుందని అంటున్నారు.

News June 11, 2024

ఎవరీ మోహన్ చరణ్?

image

ఒడిశా 15వ <<13422003>>సీఎం<<>>గా ఎన్నికైన 53 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ ఆదివాసీ నేత. ఆయన కియోంజర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు MLAగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోహన్‌కు ఏకంగా 47.05 శాతం ఓట్లు రావడం గమనార్హం. మోహన్ ప్రజాసేవతో మంచి గుర్తింపు పొందారు. ఫైర్ బ్రాండ్‌గానూ పేరొందారు. గత ఏడాది నిరసనలో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోడియంవైపు పప్పు విసిరి సస్పెన్షన్‌కు గురవ్వడంతో మోహన్ పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

News June 11, 2024

హైదరాబాద్.. ఎంఎన్‌సీలకు హాట్‌స్పాట్!

image

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. లీజు ఎన్ని కోట్లు ఉన్నా ఎంఎన్‌సీలు వెనుకాడటం లేదు. హైటెక్ సిటీలోని ‘ది స్కై వ్యూ బిల్డింగ్’లో 4.14లక్షల SFT ఆఫీస్ స్పేస్ కోసం క్వాల్‌కామ్ నెలకు రూ.3.15కోట్లు (సెక్యురిటీ డిపాజిట్ రూ.16కోట్లు) చెల్లిస్తోంది. ఇదే తరహాలో అనేక బడా సంస్థలు ఆఫీస్ లీజు కోసం పెద్ద మొత్తంలో చెల్లిస్తుండటం హైదరాబాద్ డిమాండ్‌కు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.

News June 11, 2024

‘సరదా’గా విమానానికి బాంబు బెదిరింపు!

image

ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపు వ్యవహారంలో ఓ 13ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. తనను పోలీసులు పట్టుకుంటారా? లేదా? అని చెక్‌ చేసేందుకే సరదాగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు ఈమెయిల్‌ పంపినట్లు బాలుడు చెప్పాడు. UPలోని మేరఠ్‌లో బాలుడిని పట్టుకున్న పోలీసులు జువనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట ప్రవేశపెట్టారు.

News June 11, 2024

ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు లైన్ క్లియర్

image

ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.7,250కోట్ల నిధులు సేకరించాలని సంస్థ భావిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన షేర్లతో రూ.5,500కోట్లు, మరో రూ.1,750 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. OFS కింద వాటాదార్లు 95.19 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్‌ 47.3 మిలియన్ షేర్లు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

News June 11, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

image

AP: విజయవాడలో రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉ.10 నుంచి సా.4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉ.9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని వెల్లడించారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ, అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

News June 11, 2024

యెమెన్‌లో పడవ మునిగి 49 మంది మృతి

image

యెమెన్‌ తీర ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారుల పడవ మునిగి 49 మంది సోమాలియన్లు, ఇథియోపియన్లు మరణించినట్లు యూఎన్ అంతర్జాతీయ శరణార్థుల సంస్థ తెలిపింది. మరో 140 మంది గల్లంతవగా, 71 మందిని కాపాడినట్లు పేర్కొంది. మరణించిన వారిలో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.

News June 11, 2024

ఇండియా గెలుస్తుందని బెట్టింగ్ వేసి రూ.7.5 కోట్లు గెలిచాడు!

image

ఫుట్‌బాల్, NFLతో సహా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టే కెనడియన్ రాపర్ డ్రేక్ మొన్న జరిగిన INDvsPAK మ్యాచ్‌పై ఆసక్తి చూపారు. పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని £510,000 పందెం వేసినట్లు డ్రేక్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడంతో అతడికి £715,000 (రూ. 7.58 కోట్లు) వచ్చాయని, రూ. 2.16 కోట్ల లాభం పొందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

News June 11, 2024

WFH ఎఫెక్ట్.. ఒడిశా CMకు ‘నివాసం’ కరవు!

image

ఒడిశాలో మరికొద్ది గంటల్లో BJP ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే నూతన సీఎం ఉండేందుకు నివాసం లేదు. గత 24ఏళ్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ తన ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించారు. అంతకు ముందు సీఎంలు సైతం భువనేశ్వర్ క్లబ్‌ సమీపంలోని ఓ చిన్న భవనంలో కార్యకలాపాలు సాగించారు. దీంతో నూతన సీఎం తాత్కాలికంగా ఉండేందుకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది.

News June 11, 2024

2030 కల్లా 18-20 శాతం మార్కెట్ షేర్ లక్ష్యం: టాటా మోటార్స్

image

దేశీయ మార్కెట్‌లో 2030 కల్లా 18-20% వాటాను దక్కించుకోవాలని టాటా మోటార్స్ ఆకాంక్షిస్తోంది. 2023-24 FYలో 14 శాతం మార్కెట్ వాటాతో దేశంలో మూడో అతిపెద్ద ప్రయాణికుల వాహనాల అమ్మకందారుగా టాటా మోటార్స్ నిలిచింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నూతన మోడళ్లను తీసుకురావడం, వ్యూహాత్మక వాణిజ్య ప్రణాళికలు, EV మార్కెట్‌ విస్తరణ ద్వారా తన లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.