India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా మంచి బ్రాండ్లు క్వార్టర్ రూ.99కే అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఇది అన్ని బ్రాండ్లకూ ఎలా వర్తిస్తుందని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రేటుకు సరఫరా సాధ్యం కాదంటున్నాయి. అన్ని రకాల మద్యం తక్కువ ధరకే వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని లిక్కర్ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు కోరారు.
AP ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన ‘కేకే సర్వేస్’ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సర్వే చేసింది. హరియాణాలో INCకే విజయావకాశాలు ఉన్నాయని, BJPకి ఎదురుగాలి వీస్తోందని ఆ సంస్థ MD కిరణ్ కొండేటి తెలిపారు. OCT 5న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న J&K, త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ కమలం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
రోజంతా చురుగ్గా ఉండాలంటే ఉదయం తీసుకునే ఫలహారం ఎంతో ముఖ్యం. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లో నెయ్యి, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటే శక్తితో పాటు రోగనిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చాలామంది ఉదయమే ఇడ్లీ, దోశ, పూరీలాంటివి ఆరగిస్తుంటారు. కానీ వీటిల్లో పైన చెప్పినవేవీ ఉండవు. ఉప్మాలో అవన్నీ వేసుకోవచ్చు. దీనితోపాటు గుడ్డు, గ్లాసు పాలు తాగితే ఆరోగ్యకరమని తెలిపారు.
TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీఐసెట్-2024 లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈరోజే సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రేపు పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 22న ఫ్రీజింగ్ చేసుకోవాలి. 25వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది. 25, 27 తేదీల్లో ఫీజు చెల్లించి 28వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా TCS వరుసగా మూడో ఏడాది గుర్తింపు పొందింది. $49.7 బిలియన్ల విలువతో అగ్రస్థానంలో నిలిచినట్లు Kantar BrandZ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంక్($38.3bn), ఎయిర్‌టెల్($29.86bn), ఇన్ఫోసిస్($25.22bn), SBI($17.98bn), ICICI బ్యాంక్($15.60bn), జియో($13.74bn), ఏషియన్ పెయింట్స్($13.56bn), HCL టెక్($11.82bn), LIC($11.50bn) ఉన్నాయి.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల తుది ‘కీ’ ఈ నెల 6న రిలీజ్ చేయగా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(GRL) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ మార్కులకు టెట్ స్కోరును కలిపి వారంలో లిస్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ సమాచారం లేదు. జాబితా విడుదలకు మరింత ఆలస్యం కానుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. GRL ఇచ్చాక జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి మెరిట్ జాబితాను DEOలకు పంపాల్సి ఉంటుంది.
TG: CM రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది.
AP: మరో ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు ₹1,500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. సెర్ప్ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. డ్వాక్రా సంఘాలకు ₹10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుకు విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఇందుకు ఏడాదికి ₹5వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు జరుగుతుంది. ఉ.8.30కు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. హాల్ టికెట్, ఐడీ కార్డు కచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది.
Sorry, no posts matched your criteria.