News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.

News October 27, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో అగ్నిని పుట్టించే ‘అరణి మధనం’లో రావి కర్రలను ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో దైవంతో పాటు కచ్చితంగా ఈ రావి వృక్షాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.

News October 27, 2025

AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

image

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్‌: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు

News October 27, 2025

అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం

image

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.40వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. అతడు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

News October 27, 2025

WWC: ప్రతీకా స్థానంలో షెఫాలీ వర్మ!

image

మహిళా వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన భారత ఓపెనర్ ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 30న జరిగే సెమీఫైనల్లో ఆమె జట్టులో చేరుతారని ESPN పేర్కొంది. కాగా గాయం కారణంగా ప్రతీకా టోర్నీలో మిగతా మ్యాచులకు దూరమయ్యారని వెల్లడించింది. దూకుడుగా ఆడే ప్లేయర్‌గా పేరున్న షెఫాలీ రాకతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 27, 2025

92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

image

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.

News October 27, 2025

ఎస్‌బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

image

నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్‌లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.

News October 27, 2025

రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్ని: నటి ధన్య

image

కండీషన్లు పెట్టుకోవడం వల్లే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగలేకపోయానని నటి ధన్య బాలకృష్ణన్ అన్నారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దనే కండీషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే మంచి పొజీషన్‌లో ఉండేదాన్ని అని పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఆమె నటించిన ‘కృష్ణలీల’ NOV 7న రిలీజ్ కానుంది.

News October 27, 2025

ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

image

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.

News October 27, 2025

₹5500 కోట్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

‘ఆత్మనిర్భరత్’ సాధనలో ₹5500 కోట్లతో చేపట్టే 7 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి వల్ల రానున్న కాలంలో రూ.20వేల కోట్లమేర దిగుమతి వ్యయం తగ్గుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Kaynes Syrmaతోపాటు మరో మూడు గ్రూపులు రూ.వేల పెట్టుబడులతో ముందుకొచ్చాయన్నారు. కాగా ₹1.15 లక్షల కోట్లతో ప్రతిపాదనలు అందినట్లు ఎలక్ట్రానిక్స్ & IT కార్యదర్శి కృష్ణన్ తెలిపారు.