News September 18, 2024

గ్రామీణ యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!

image

బిహార్ అనగానే వలసలు, గొడవలే గుర్తొస్తాయి. కానీ, తమలోనూ ఎంతో ప్రతిభ ఉందని జము ఖరియాకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అభిషేక్ కుమార్ నిరూపించారు. గ్రామీణప్రాంతానికి చెందిన అతను లండన్‌లోని గూగుల్ కంపెనీలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. NIT పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022లో Amazonలో ₹1.08 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందారు. తాజాగా గూగుల్‌లో జాబ్ సాధించారు.

News September 18, 2024

ప్రతి బాల్‌కు ముందు ‘ఓం నమః శివాయ’ జపం చేశా: కోహ్లీ

image

బీసీసీఐ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విరాట్ కోహ్లీ పటిష్ఠమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించారని, 25 ఏళ్ల వయసులోనే పవర్‌ఫుల్ టీమ్‌ను ఏర్పరిచారని గంభీర్ కొనియాడారు. కాగా 2014-15 ఆస్ట్రేలియన్ టూర్‌లో ప్రతి బాల్‌కు ముందు ఓం నమః శివాయ జపం చేసినట్లు కోహ్లీ తెలిపారు. 2009 NZ పర్యటనలో రెండున్నర రోజులు ‘హనుమాన్ చాలీస’ విన్నట్లు గంభీర్ చెప్పారు.

News September 18, 2024

పేజర్లలా మన మొబైళ్లనూ పేల్చేస్తే?

image

<<14129580>>లెబనాన్‌లో పేజర్ల<<>> పేలుళ్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైళ్లపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సింపుల్ నెట్‌వర్క్, లిథియం బ్యాటరీలుండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది. ఇక GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్స్, పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే సెల్‌ఫోన్లను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సైబర్ అటాక్స్‌పై భయం రెట్టింపైంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

News September 18, 2024

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే ఉదయభాను?

image

AP: వైసీపీ నేత, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు దీనిపై ఆయన సమాచారం ఇచ్చారని, బ్యానర్‌లు, జనసేన పార్టీ జెండా దిమ్మల పనులు చేయిస్తున్నట్లు టాక్. ఈనెల 24 లేదా 27న ఆయన JSP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News September 18, 2024

‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

image

నార్నె నితిన్ హీరోగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈనెల 20న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు.

News September 18, 2024

మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు

image

AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News September 18, 2024

నెల్లూరులో జానీ మాస్టర్!

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

News September 18, 2024

రాహుల్‌పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో పాటు బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు.

News September 18, 2024

ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ‘ఆయుధ పూజ’ సాంగ్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 11.07గంటలకు సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫొటోను పంచుకున్నారు. ఈనెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News September 18, 2024

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.