News June 7, 2024

T20WC: థ్రిల్లింగ్ విక్టరీ.. పాక్‌కు USA షాక్

image

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌‌కు USA షాక్ ఇచ్చింది. సునాయసంగా గెలుస్తామని పాక్ భావించిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన USA మ్యాచ్‌ను టై చేసింది. సూపర్ ఓవర్‌లో USA 19 పరుగులు చేయగా, ఛేదనలో పాక్‌ 13 రన్స్‌కే చతికిలపడింది. దీంతో USA ఐదు పరుగులు తేడాతో గెలుపొందింది.

News June 7, 2024

ఉక్రెయిన్‌కు రావాలని మోదీని ఆహ్వానించా: జెలెన్ స్కీ

image

స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగే శాంతి సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విటర్‌లో తెలిపారు. ఈ సమావేశంలో భారత్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అవకాశం ఉంటే ఉక్రెయిన్‌ను సందర్శించాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో ఈ నెల 15-16న శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు.

News June 7, 2024

సూడాన్‌లో నరమేధం.. 100 మంది మృతి

image

సూడాన్‌లోని గెజీరా ప్రావిన్స్‌ పరిధిలోని వాద్ అల్ నౌరా గ్రామంలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) చేపట్టిన దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సూడాన్ ఆర్మీ తమపై దాడులకు ప్రయత్నించిందని అందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు RSF పేర్కొంది. సూడాన్ సైన్యం, RSF మధ్య ఏడాదిగా కొనసాగుతున్న పోరులో ఇప్పటివరకు 14వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

News June 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 7, 2024

BRSకు గడ్డు కాలం!

image

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న BRS.. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, MBNRలో డిపాజిట్లు దక్కలేదు. 17 సీట్లలో ఒక్క చోట కూడా గెలవకపోవడంతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు MP ఎన్నికల్లో ‘డకౌట్’తో BRS దుకాణం బంద్ అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

News June 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 7, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు అసర్: సాయంత్రం 4:51 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు ఇష: రాత్రి 8.11 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 7, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 7, శుక్రవారం
జ్యేష్ఠమాసం, శు.పాడ్యమి: సా.04.45 గంటల వరకు
మృగశిర: రాత్రి 07:43 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.08:13 నుంచి 09:05 వరకు తిరిగి మధ్యాహ్నం గం.12.32 నుంచి 01.23 వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.01.44 నుంచి 03.18 వరకు

News June 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 7, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఈ నెల 9న సాయంత్రం మోదీ ప్రమాణస్వీకారం
* ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* చివరి మ్యాచ్ ఆడేసిన సునీల్ ఛెత్రి
* ఎంపీ కంగనకు చెంపదెబ్బ.. CISF కానిస్టేబుల్ సస్పెండ్
* ఎలక్షన్స్ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేత
* నటి హేమ ‘మా’ సభ్యత్వంపై సస్పెన్షన్
* TG: దోస్త్ ఫేజ్-1లో 76,290 సీట్లు కేటాయింపు

News June 7, 2024

తొలి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటిలో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం దక్కింది.