India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓలా స్కూటర్‌పై బెంగళూరుకు చెందిన నిషా అనే యువతి చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ స్కూటర్ ఓ డబ్బా అంటూ ఆమె మండిపడ్డారు. సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన ఓ ప్లకార్డును బైక్‌కు కట్టి ఫొటో తీశారు. ‘దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ కొనొద్దు. ఓ స్మార్ట్ ఫోన్ అటాచ్ చేసిన డబ్బా అది. 10 నెలల్లో 3సార్లు రిపేర్లు వచ్చాయి. సిగ్గుండాలి ఓలాకి’ అని దానిపై రాశారు.
US మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రముఖుల భద్రతపై చర్చ జరుగుతోంది. ఆ దేశ చరిత్రలో ఏకంగా నలుగురు అధ్యక్షులు- అబ్రహాం లింకన్(1865), జేమ్స్ గార్ఫీల్డ్(1881), విలియం మెకిన్లే(1901), జాన్ ఎఫ్ కెన్నెడీ(1963) హత్యకు గురయ్యారు. మరో నలుగురు రూజ్‌వెల్ట్(1912), గెరాల్డ్ ఫోర్డ్ (1975), రొనాల్డ్ రీగన్(1981), ట్రంప్(2024)(అధ్యక్ష అభ్యర్థి) హత్యాయత్నం నుంచి బయటపడ్డారు.
TG: ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్సులు 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్సుల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. అలాగే హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు దగ్గర్లో అంబులెన్సులను మోహరించాలని యోచిస్తోంది. అంబులెన్సు లేట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు గరిష్ఠాల్లో మొదలయ్యాయి. మంగళవారం మీటింగులో US ఫెడ్ వడ్డీరేట్ల కోతను ఆరంభిస్తుందన్న సంకేతాలు మార్కెట్లను నడిపిస్తున్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో నిఫ్టీ 62పాయింట్ల లాభంతో 25,418 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్లు పెరిగి 83,112 వద్ద చలిస్తోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 41:9గా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, NTPC, హిందాల్కో, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్.
బంగ్లాదేశ్‌లో వర్గ వైషమ్యాలు తగ్గడం లేదు. కొన్నాళ్ల కిందట చెలరేగిన హింసలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. భారత స్నేహ చిహ్నాలను బద్దలుకొట్టారు. తాజాగా సూఫీ మందిరాలు, స్థలాలపై దుండుగులు దాడులు చేస్తుండటంతో ఆ వర్గంవారే సొంతంగా భద్రతను చూసుకుంటున్నారు. రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ఉర్సు నిర్వహిస్తుండగా నిన్న రాత్రి సిలెట్‌లో హజ్రత్ షా పరన్ కట్టడంపై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన HYD జలసౌధలో ఇవాళ రెండు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఉత్తమ్ ఛైర్మన్‌గా ఉన్న రేషన్-హెల్త్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. రేషన్, హెల్త్ కార్డులపై రాజకీయ పార్టీలు, MLAల నుంచి వచ్చిన సిఫార్సులు, విధివిధానాలపై మ.2 గంటలకు, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 4 గంటలకు చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
‘దేవర’ సినిమా 1980-1990 మధ్య కాలంలో జరిగే కథ అని డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఇది రెగ్యులర్ హీరో-విలన్ ఫిల్మ్ కాదని అన్నారు. ఒకే ఫ్యామిలీలోని సభ్యుల మధ్య రిలేషన్‌షిప్స్ గురించే ఈ సినిమా ఉంటుందన్నారు. ఇది యాక్షన్ డ్రామా మూవీ అని హీరో ఎన్టీఆర్ తెలిపారు. ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
TG: కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ₹1.5లక్షలు, పట్టణాల్లో ₹2లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలన్నారు.
AP: పౌర్ణమి సందర్భంగా ఈ నెల 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5.55 గంటలకు కామథేను ఆలయం నుంచి కుమ్మరిపాలెం, 4 స్థంభాలు, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, రథం సెంటర్ మీదుగా మహామండపం వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఇటీవల ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.