News December 10, 2024

రాజ్యసభకు నామినేషన్ల దాఖలు

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు TDP నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరి ఏకగ్రీవం లాంఛనమే. YCP నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య రాజీనామాతో ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి TDP, బీజేపీ నుంచి మళ్లీ అవకాశం దక్కింది.

News December 10, 2024

‘పుష్ప 2’లో బన్నీ ధరించిన దుస్తులు ఎక్కడివంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ఈ మూవీలో బన్నీ ధరించిన కాస్ట్యూమ్స్ గురించి చర్చ జరుగుతోంది. పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాలనే అల్లు అర్జున్ ధరించారు. పోచంపల్లిలో ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ సమయంలోనే మూవీ యూనిట్ ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేసింది.

News December 10, 2024

జైపూర్ షెడ్యూల్‌లో రజినీతో ఆమిర్ ఖాన్ షూట్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ షెడ్యూల్‌లో రజినీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News December 10, 2024

UGC NET దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

image

UGC NET-2024 <>దరఖాస్తు<<>> గడువు నేటితో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు రేపటి వరకూ అవకాశం ఉంది. ఎడిట్ ఆప్షన్ ఈనెల 12, 13 తేదీల్లో అందుబాటులోకి రానున్నట్లు NTA తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో‌షిప్, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత, పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

News December 10, 2024

బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

AP: కేంద్రం, IIT మద్రాస్ అమలుచేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం SWAYAM రాష్ట్రంలోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాటితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బీటెక్ విద్యార్థులకు 72 రకాల కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ఒక సెమిస్టర్ పాటు శిక్షణ అందించనుంది. వీరికి IIT మద్రాస్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అదనంగా క్రెడిట్లు కూడా ఇస్తుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 10, 2024

చీటింగ్ కేసు: ఫేమస్ యాక్టర్‌కు కోర్టు సమన్లు

image

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర చిక్కుల్లో పడ్డారు. ‘గరమ్ ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టేలా తనను మోసగించారని ఢిల్లీ వ్యాపారి సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ‘నిందితులు ఉమ్మడి ఆసక్తితోనే ఫిర్యాదుదారును మోసగించినట్టు రికార్డుల్లోని సాక్ష్యాలు సూచిస్తుండటంతో సమన్లు జారీ చేస్తున్నాం’ అని కోర్టు తెలిపింది.

News December 10, 2024

FLASH: ఆర్జీవీకి భారీ ఊరట

image

AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది.

News December 10, 2024

షాకింగ్.. రూ.10కోట్ల స్కామ్ చేసిన ప్యూన్!

image

మధ్యప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్యూన్‌గా పనిచేసే బ్రిజేంద్ర దాస్ మరో ఐదుగురితో కలిసి రూ.10కోట్ల స్కామ్‌కు పాల్పడ్డాడు. బ్యాంకుల్లో పనిచేస్తున్న ఇతర నిందితులు బ్రిజేంద్రను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్‌గా చూపించి, ఫేక్ డాక్యుమెంట్స్‌తో రూ.10కోట్లను అతడి ఖాతాలో జమ చేశారు. ప్రభుత్వ స్కీమ్ కింద భూములు కొనేందుకు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. బ్రిజేంద్రతో సహా ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 10, 2024

పుష్ప-2 చూస్తూ అభిమాని మృతి

image

AP: అనంతపురం(D) రాయదుర్గంలోని థియేటర్‌లో పుష్ప-2 చూస్తూ మద్దానప్ప(37) అనే అభిమాని మృతి చెందాడు. షో ముగిసిన తర్వాత కూడా అతను సీటులోనే ఉండటంతో ప్రేక్షకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయినట్లు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అయితే మద్దానప్ప తొక్కిసలాటలో మరణించి ఉంటాడనే అనుమానంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

News December 10, 2024

కుమారులతో మోహన్ బాబు చర్చలు

image

హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. <<14837635>>కుటుంబంలో వివాదం<<>> నెలకొన్న నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ చర్చించుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో విష్ణు దుబాయ్ నుంచి ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.