News June 4, 2024

దర్శిలో నిలిచిపోయిన కౌంటింగ్?

image

AP: ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇప్పటివరకు 16 రౌండ్లు పూర్తి కాగా ప్రస్తుతం కౌంటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ 827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

అన్నింటికీ సిద్ధంగా ఉన్నా: సీఎం జగన్

image

AP: ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మంచి చేయడానికి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. ‘పడిన చోటు నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తాం. ఇది పెద్దవాళ్ల కూటమి. ఎవరూ చూడని కష్టాలు, పోరాటాలు నా జీవితంలో చూశా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా నేను సిద్ధం. అన్నింటికీ సిద్ధపడే ఉన్నా. మాకు తోడుగా నిలబడిన వారికి కృతజ్ఞతలు’ అంటూ జగన్ ప్రసంగం ముగించారు.

News June 4, 2024

అనురాగ్, జ్యోతిరాదిత్య, రిజిజు విజయం

image

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ అభ్యర్థులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు విజయం సాధించారు. హమీర్‌పూర్ (HP) నుంచి అనురాగ్ 1.82లక్షల ఓట్ల మెజారిటీతో, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ లక్ష ఓట్ల తేడాతో, గుణ(MP) నుంచి జ్యోతిరాదిత్య 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News June 4, 2024

వయ‌నాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా!

image

ఈ ఎన్నిక‌ల్లో వయ‌నాడ్, రాయ్‌బ‌రేలి నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తార‌న్నదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాహుల్ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బ‌రేలి నుంచి త‌ల్లి సోనియా ఇప్ప‌టికే అనేక‌సార్లు పోటీ చేయ‌డం, యూపీలాంటి బ‌ల‌మైన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోసం రాహుల్ రాయ్‌బ‌రేలి వైపు మొగ్గుచూప‌నున్న‌ట్టు స‌మాచారం.

News June 4, 2024

కడపలో అవినాశ్ విజయం

image

AP: కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిపై 69,050 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో 3,80,726 మెజార్టీ రాగా ఈసారి ఏకంగా 3 లక్షల ఓట్లు తగ్గడం గమనార్హం. కాగా 1.34 లక్షల ఓట్లు సాధించిన షర్మిల డిపాజిట్ కోల్పోయారు.

News June 4, 2024

రేపు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం: రాహుల్

image

ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందన్నారు. దేశానికి మా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని వివరించారు. రేపు కూటమి నేతల సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.

News June 4, 2024

ఇది ప్రధాని మోదీ ఓటమి: ఖర్గే

image

లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది PM మోదీ ఓటమి. మోదీ పేరు మీద ఓట్లు అడిగిన వారిదే ఈ పరాజయం. ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలిచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ పుంజుకుంది. ఇండియా కూటమి నేతలు ఏకతాటిపై నడిచి ఐకమత్యంతో ఫలితాలు సాధించాం’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

News June 4, 2024

కుప్పంలో చంద్రబాబు ఘన విజయం

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఎనిమిదోసారి బంపర్ విక్టరీ సాధించారు. వైసీపీ అభ్యర్థి భరత్‌పై 48,184 ఓట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. చంద్రబాబు 1989 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

News June 4, 2024

పల్నాడులో కుమ్మేసిన టీడీపీ సీనియర్లు

image

AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి 32,795 ఓట్ల మెజార్టీ రాగా 1,09,885 ఓట్లు నమోదయ్యాయి. వినుకొండలో జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలవగా 29,683 మెజార్టీ దక్కింది. గురజాలలో యరపతినేని శ్రీనివాస్ 29,100 మెజార్టీతో నెగ్గారు. ఆయనకు 1,02,396 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

ఒంగోలులో బాలినేని ఓటమి

image

AP: ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఆయన 34,100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.