News October 28, 2025

రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, NZB, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News October 28, 2025

మరోసారి బాలకృష్ణకు జోడీగా నయనతార?

image

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

News October 28, 2025

మానవులకు బాధలెందుకు కలుగుతాయి?

image

మానవులకు సుఖదుఃఖాలు కలగడానికి ముఖ్య కారణం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనం చేసే పనుల మీద, మనం చూసే, వినే, తినే విషయాల మీద మనకు ఇష్టం లేదా అయిష్టం అనే భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక విషయం నచ్చితే ఆనందం కలుగుతుంది. లేకపోతే బాధ కలుగుతుంది. ఈ విధంగా మన ఇష్టాలు, అయిష్టాల (రాగద్వేషాల) కారణంగానే మనుషులకు సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ రెండింటిని దాటితేనే శాంతి చేకూరుతుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 28, 2025

అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

image

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.

News October 28, 2025

LRS గడువు పొడిగింపు

image

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

News October 28, 2025

PKL: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో ఇవాళ తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్ మధ్య ఎలిమినేటర్-3 మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేపు క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. కాగా నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పుణెరి పల్టాన్‌పై గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లోనైనా విజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 28, 2025

సూర్య ఫామ్ లేమిపై ఆందోళన లేదు: గంభీర్

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన లేదని హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. ‘ఫియర్‌లెస్, అగ్రెసివ్‌గా ఆడాలన్నదే మా ఆలోచన. అలా ఆడినప్పుడు త్వరగా ఔటవ్వడం, మిస్టేక్స్ సహజం. 30 బంతుల్లో 40 రన్స్ చేస్తే విమర్శలకు దూరంగా ఉండొచ్చు. కానీ మా అప్రోచ్ అది కాదు. T20లకు కెప్టెన్‌గా సూర్య ఫర్ఫెక్ట్. జట్టును బాగా నడిపిస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. AUS, IND మధ్య తొలి T20 రేపు జరగనుంది.

News October 28, 2025

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలు: మంత్రి

image

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాం. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10-12% తగ్గిస్తుంది. భూసేకరణను సగానికి తగ్గిస్తుంది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు ₹1,500-1,600Cr ఆదా చేస్తుంది’ అని చెప్పారు.

News October 28, 2025

అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే

News October 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.