India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఆఫీసర్ వికాస్ యాదవ్‌పై అమెరికా అభియోగాలు మోపింది. న్యూయార్క్‌లో ఖలీస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూను హతమార్చేందుకు వికాస్ కుట్ర చేశారని FBI పేర్కొంది. ఇందుకోసం నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, గతేడాది అతడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమిస్తామని భారత్ చెప్పగా.. అమెరికా సంతృప్తి వ్యక్తం చేసింది.
AP: రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్‌ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
TG: రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ఏప్రిల్‌లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ కాంట్రాక్టు వైద్యుల నియామకం కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.
దేశాలు వేరైనా క్రీడాకారులుగా అంతా ఒక్కటే అని భారత్ స్టార్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ నిరూపించారు. ఇటీవల ఉమెన్స్ T20WC మధ్యలో తన తండ్రి చనిపోవడంతో నిరాశలో ఉన్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఆమె స్వయంగా గీసిన ఓ చిత్రాన్ని పంపారు. ‘నీకు ఇష్టమైనది చెయ్యి’ అని రాసుకొచ్చారు. ఇందుకు ఫాతిమా ఆమెకు సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పారు. దీనికి శ్రేయాంక స్పందిస్తూ.. ‘నీతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా’నన్నారు.
కేక్ తింటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. బేకరీల నుంచి తెచ్చుకునే కేక్ కలుషితమయ్యే ఆస్కారం ఉంటుంది. దానిని తింటే డయాబెటిస్, బీపీ, లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ముఖంలో వాపు, అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కేక్ తయారీకి వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కేక్స్ అతిగా తినకపోవడమే మంచిది.
AP: నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.
కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.
AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
TG: మాజీ మంత్రి హరీశ్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని, అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.
సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్‌గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.