India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ART సెంటర్లు ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పుడున్న 22కేంద్రాలతో పాటు త్వరలో 34సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.20లక్షల మంది HIV/ఎయిడ్స్ బాధితుల్లో లక్షమందికి పైగా రెగ్యులర్‌గా మందులు తీసుకుంటున్నారు. 33 జిల్లాల్లో పరీక్షల నిర్వహణ, బాధితులకు సకాలంలో మందుల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

టెన్త్/ఇంటర్/డిప్లొమాలో 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ <
వెబ్సైట్: https://licindia.in/

విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్‌స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్‌ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్‌కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్‌తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 6న చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. GHMC మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో భద్రపరుస్తున్నారు. మరో 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మహాయుతి’ గెలుపుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ‘మనం ఓడిన మాట నిజమే. దానిపై ఎక్కువ చింతించడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి’ అని హితబోధ చేశారు. ఎంవీఏ కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వీడటాన్ని పవార్ తోసిపుచ్చారు. ప్రతిపక్ష ఐక్యత కీలకమని అఖిలేశ్ భావిస్తున్నారని తెలిపారు.

పరుగు పందెం అనగానే మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు. ఒలింపిక్స్‌లో ఈ అథ్లెట్ నెలకొల్పిన రికార్డులు అలాంటివి మరి. తాజాగా, బోల్ట్ రికార్డును ఆస్ట్రేలియా స్ప్రింటర్ గౌట్ బద్దలుకొట్టారు. ఆస్ట్రేలియన్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200మీ. పరుగును 20.04 సె.లో పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డ్ బోల్ట్ పేరిట (20.13సె) ఉండేది. రానున్న ఒలింపిక్స్‌లో గౌట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నారు.

TG: సికింద్రాబాద్‌లోని జోగిందర్ స్టేడియం, AOC సెంటర్లో 2025 JAN 6 నుంచి MAR 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌కు టెన్త్, ఆఫీస్ అసిస్టెంట్‌కు ఇంటర్ పాసైన వారు అర్హులు. వయసు 17-21 ఏళ్లు ఉండాలి. వివరాలకు tuskercrc2021@gov.in మెయిల్, joinindianarmy@nic.inను సందర్శించండి.

TG: పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో రేపు అసెంబ్లీని ముట్టడించనున్నట్లు సర్పంచుల జేఏసీ ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా అసెంబ్లీని ముట్టడిస్తారని జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. శాసనసభ సమావేశాల్లో పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

AP: రాష్ట్రంలో 3వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదు విషయంలో సీఎస్‌కు NHRC సమన్లు జారీ చేసింది. దీనిపై నివేదికలు పంపాలని రిమైండర్లు పంపినా స్పందించకపోవడంపై మండిపడింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో జనవరి 20లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాలికల మిస్సింగ్‌పై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.