News November 25, 2024

రాహుల్, ఉద్ధవ్, పవార్ ఏక్ హైతో ‘రాజ్యసభ ఎంట్రీ సేఫ్ హై’

image

మహారాష్ట్రలో ఓటమితో MVA ఇద్దరినైనా రాజ్యసభకు పంపలేని దుస్థితికి చేరింది. ప్రస్తుతం SS UBT 20, కాంగ్రెస్ 16, NCP SP 10, SP 2 కలిపి MVAకు అసెంబ్లీలో ఉన్న బలం 48. ఈ రాష్ట్రం 2026లో 8 మందిని RSకు పంపాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 33 ఓట్లు కావాలి. ఈ లెక్కన శరద్ పవార్, ప్రియాంక చతుర్వేదిలో ఎవరో ఒక్కర్నే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు పార్టీల్లో ఎవరు ఎవరికి హ్యాండిచ్చినా ఒక్కరూ రాజ్యసభకు పోలేని పరిస్థితి.

News November 25, 2024

BRS వాళ్లకు మెదడు కూడా పోయింది: రేవంత్

image

TG: అదానీ సంస్థకు తెలంగాణలో భారీ సంఖ్యలో ప్రాజెక్టులు ఇచ్చి BRS కమీషన్లు మెక్కిందని CM రేవంత్ ఆరోపించారు. ‘నేనేం చేశాను? CSR ఫండ్స్ నుంచి నిరుద్యోగ యువత, స్కిల్ వర్సిటీ కోసం రూ.100 కోట్లు తీసుకొచ్చా. మా కుటుంబం ఆ నిధులు కొట్టేయలేదు. KCR, KTR గతంలో అదానీని కలిసి వంగి వంగి నమస్కారాలు పెట్టారు. BRS నేతలకు గతేడాది అధికారం, ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడూ పోయింది’ అని ఎద్దేవా చేశారు.

News November 25, 2024

మ‌హాయుతి బూస్ట్‌.. మార్కెట్ల‌కు జోష్‌

image

దేశ ఆర్థిక రాజ‌ధానిలో ఏర్ప‌డిన రాజ‌కీయ సుస్థిర‌త‌తో బ్యాంకు, ఫైనాన్స్ రంగ షేర్లు రాణించ‌డంతో బెంచ్ మార్క్ సూచీలు సోమ‌వారం లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 992 పాయింట్ల లాభంతో 80,109 వ‌ద్ద‌, నిఫ్టీ 314 పాయింట్ల లాభంతో 24,221 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డ్డాయి. ONGC 5%, BEL 4.56%, LT 4% లాభ‌ప‌డి Top Gainersగా నిలిచాయి. JSW Steel, TechM, Infy Top Losersగా నిలిచాయి.

News November 25, 2024

జైలుకెళ్తే CM అవుతానని KTR అనుకుంటున్నారు: రేవంత్

image

TG: జైలుకెళ్లాలని KTR చూస్తున్నారని CM రేవంత్ ఎద్దేవా చేశారు. ‘అదానీకి ఎన్ని రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చారు? ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చారు? అనే వాటిపై విచారణకు KTR సిద్ధమా? విచారణకు ఆదేశిస్తే కేసులు పెడుతున్నారని ఆయన ఏడుస్తున్నారు. జైలుకెళ్తే సీఎం అవుతానని ఆయన అనుకుంటున్నారు. అలా అయితే వాళ్ల చెల్లికి ఛాన్సు ఉంటుంది. వాళ్ల ఇంట్లో ఉన్న పోటీని తట్టుకోలేక ఇలా చిల్లరగా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.

News November 25, 2024

IPL వేలంలో ఈ భారత్ ఆటగాళ్లకు షాక్

image

భారత క్రికెటర్లు అజింక్య రహానే, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అలాగే SRH మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా ఎవరూ కొనలేదు.

News November 25, 2024

మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్

image

TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.

News November 25, 2024

రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు: సీఎం

image

TG: రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి తెలంగాణలో పెట్టుబడులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూల్స్ ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచే తాము కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

News November 25, 2024

IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభం

image

సౌదీలోని జెడ్డాలో IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో 72మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వారిలో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల కోసం జట్ల యాజమాన్యాలు ₹467.95 కోట్లు ఖర్చు చేయగా, పంత్‌ను LSG రూ.27కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. jiocinema, StarSportsలో ఆక్షన్ లైవ్ చూడొచ్చు.

News November 25, 2024

దావూద్‌తో ప్రాణహాని వల్లే దేశం విడిచా: లలిత్ మోదీ

image

దావూద్ ఇబ్ర‌హీం నుంచి ప్రాణ హాని వ‌ల్లే దేశం విడిచినట్లు IPL మాజీ ఛైర్మ‌న్ లలిత్ మోదీ తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటి అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై త‌న‌కున్న జీరో టోల‌రెన్స్ పాల‌సీ కార‌ణంగా దావూద్ త‌న‌ను టార్గెట్ చేశాడ‌ని రాజ్‌ ష‌మానీ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో లలిత్‌ వెల్లడించారు. త‌న హ‌త్య‌కు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని, దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే దేశం విడిచానన్నారు.

News November 25, 2024

పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

TG: మాజీ MLA పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. లగచర్ల ఘటనకు సంబంధించి తనపై 3 కేసులు నమోదు చేశారని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒక ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దని సుప్రీం తీర్పులను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దాడి ఆధారంగా పోలీసులు ఆ కేసులు నమోదు చేశారని ఏఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.