News May 24, 2024

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

image

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంపై రష్యా భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా, 16 మందికి గాయాలైనట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాది అతి కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. తమకు పాశ్చాత్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిట్టూర్చారు. రష్యా వైమానిక దాడుల్ని ఎదుర్కునేలా తగినన్ని రక్షణ వ్యవస్థల్ని అందించడం లేదని అన్నారు.

News May 24, 2024

టీమ్ఇండియా హెడ్‌కోచ్ జీతం ఎంత?

image

ఇటీవల టీమ్ఇండియా హెడ్‌కోచ్ పదవి కోసం BCCI విడుదల చేసిన ప్రకటనలో జీతం విషయాన్ని పేర్కొనలేదు. వేతనం గురించి చర్చించుకోవచ్చని, అనుభవం ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ద్రవిడ్‌కు ముందు రవిశాస్త్రి కూడా ఏడాదికి రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈసారి హెడ్‌కోచ్‌కు భారీ ప్యాకేజ్ దక్కే అవకాశముంది.

News May 24, 2024

ENGLISH LEARNING: SYNONYMS

image

Captivate: Charm, fascinate
Deliberate: cautious, intentional
Guile: cunning, deceit
Frugality: economy, providence
Malice: Vengefulness, grudge
Remnant: Residue, piece
Tranquil: Amicable, Calm
Yell: shout, shriek
Zest: delight, enthusiasm

News May 24, 2024

ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రధానిపై కాల్పులు జరిపా: నిందితుడు

image

ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడం వల్లే స్లోకేవియా ప్రధాని రాబర్ట్ ఫికో(59)పై కాల్పులు జరిపినట్లు నిందితుడు(71) పోలీసుల విచారణలో తెలిపారు. తన చర్యపై పశ్చాత్తాప పడుతున్నానని.. ప్రధానిని క్షమాపణ కోరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలన్నది అతని ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నెల 15న ఫికోపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం PM చికిత్స పొందుతున్నారు.

News May 24, 2024

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై విచారణ

image

AP: సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. క్యాట్ ఉత్తర్వులు హేతుబద్దంగా లేవని GOVT తరఫు న్యాయవాది వాదించారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని క్యాట్ తేల్చినట్లు వెంకటేశ్వరరావు తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు.

News May 24, 2024

మే 24: చరిత్రలో ఈరోజు

image

1686: థర్మామీటర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్ జననం
1543: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ మరణం
1819: బ్రిటన్ రాణి విక్టోరియా జననం
1939: నటుడు విజయచందర్ జననం
1966: నటి జీవిత జననం
కామన్వెల్త్ దినోత్సవం
జాతీయ సోదరుల దినోత్సవం

News May 24, 2024

కాంగ్రెస్ వల్లే ఆ పుణ్యక్షేత్రం పాక్‌లో ఉంది: మోదీ

image

అధికార కాంక్షతో కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘సిక్కుల పుణ్యక్షేత్రమైన కర్తార్‌పుర్‌ సాహిబ్‌ పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉంది. 1971లో ఆ పుణ్యస్థలాన్ని భారత్‌లో భాగం చేసే అవకాశం వచ్చినా కాంగ్రెస్ వదిలేసింది. అప్పుడు నేను అధికారంలో ఉంటే ఆ స్థలాన్ని పాకిస్థాన్ నుంచి వెనక్కి తెచ్చి ఉండేవాడిని’ అని అన్నారు.

News May 24, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 24, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:44 గంటలకు
ఇష: రాత్రి 08.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 24, 2024

SRHకి కష్టమే: అంబటి రాయుడు

image

చెన్నైలో జరిగే క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలవడం సన్‌రైజర్స్‌కు కష్టమేనని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో పోలిస్తే రాజస్థాన్ బౌలర్లకు ఆ పిచ్ బాగా నప్పుతుందని పేర్కొన్నారు. ‘ఈ మ్యాచ్‌లో RR ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అదేమీ హైదరాబాద్ వికెట్ కాదు. SRH ఆటగాళ్లు మెదడు ఉపయోగించి ఆచితూచి ఆడాలి. అక్కడ వికెట్లు తీయలేరు కాబట్టి బ్యాటింగ్‌తోనే పైచేయి సాధించాలి’ అని సూచించారు.

News May 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.