India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు RRతో క్వాలిఫయర్2లో SRH భవితవ్యం పవర్ హిట్టింగ్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్(533 రన్స్), అభిషేక్(470 రన్స్)పైనే ఆధారపడి ఉంది. బౌల్ట్, అశ్విన్, చాహల్ వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్ చేయాలంటే ఈ జోడీ రాణించకతప్పదు. వీరితో పాటు క్లాసెన్(413) కూడా మరోసారి ఆపద్బాంధవుడిగా మారాలి. కెప్టెన్ కమిన్స్, భువీ, నట్టూలతో కూడిన బౌలింగ్ యూనిట్ ఎలాగూ మినిమం గ్యారంటీ పెర్ఫామెన్స్ ఇస్తుంది.
క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. మే 31న రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా జూన్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. అతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తున్నారు.
RBI కేంద్రానికి ఇచ్చిన రూ.2.11లక్షల కోట్ల భారీ డివిడెండ్ సూచీలు లాభాలు బాట పట్టేలా చేశాయంటున్నారు విశ్లేషకులు. వివిధ రంగాల్లో పెట్టుబడికి, ద్రవ్యలోటు తగ్గడానికి అవకాశం ఉండటం సానుకూలత తెచ్చిందన్నారు. ఎన్నికల ఫలితాలపై అపోహలు తగ్గడం, Q4 ఫలితాలు, FII కొనుగోళ్లపై అంచనా కలిసొచ్చిందన్నారు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ రాణించడమూ ఓ కారణమని తెలిపారు. కాగా సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
AP: ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. పాల్వాయిగేటు PO, APOను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. TDP నేతలు మాచర్ల వెళ్లడం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.
కోలీవుడ్ హీరో విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మూవీ ‘రత్నం’ ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ హరి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యోగిబాబు, గౌతమ్ మేనన్, మురళీ శర్మ, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.
అశ్లీల వీడియోల కేసులో నిందితుడు, JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడి దౌత్య పాస్‌పోర్టు రద్దు ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. రేవణ్ణ పాస్‌పోర్టు రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖకు లెటర్ రాసింది. ఈ మేరకు ప్రజ్వల్ పాస్‌పోర్టు రద్దు దిశగా MEA చర్యలు చేపట్టినట్లు సమాచారం అందిందని వార్తా సంస్థ PTI తెలిపింది.
ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక రన్స్ సాధించిన టాప్ 5 లిస్టులో కోహ్లీవే రెండు స్థానాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కూడా ఆయన 741 రన్స్ బాదారు. అంతకుముందు 2016లో 973 రన్స్ బాదారు. కోహ్లీ (973) అత్యదిక పరుగుల రికార్డుకు శుభ్‌మన్ గిల్ (890) చేరువగా వచ్చినా బ్రేక్ చేయలేకపోయారు. జోస్ బట్లర్ (863), డేవిడ్ వార్నర్ (848) కూడా దరిదాపుల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత మరే ఆటగాడు ఈ ఘనతను అందుకోలేకపోయారు.
పది గ్రాముల బంగారం ధర మరో 9 ఏళ్లలో రూ.2లక్షలకు చేరే అవకాశముందని ఎనలిస్టులు చెబుతున్నారు. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతీ 9 ఏళ్లకు 3రెట్లు పెరుగుతోందని, ప్రస్తుతం రూ.70వేలకు పైగా ఉన్న 10gms గోల్డ్ రేటు, 2033 నాటికి రూ.2.1లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు. 2015లో ఈ ధర రూ.24,740 ఉండగా, 2023 నాటికి 3 రెట్లు పెరిగిందని, అంతకుముందు కూడా ఇదే ట్రెండ్ కనిపించిందని పేర్కొన్నారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్‌గా రావడంపై నటి హేమను మీడియా సంప్రదించగా ఆమె దురుసుగా సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడేం మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారు. మరోవైపు మొదట్లో తాను పార్టీకి వెళ్లలేదని చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన హేమ.. నిన్న ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను రిలీజ్ చేశారు.
మొబైల్ ఫోన్స్‌లో ఉండే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫీచర్ గురించి చాలామందికి తెలియదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టులో ఫ్యామిలీ మెంబర్స్ నంబర్లు యాడ్ చేసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఇతరులు వారికి కాల్ చేసి ఇన్‌ఫార్మ్ చేయొచ్చు. దీనికోసం ఆండ్రాయిడ్‌లో Settings> safety & Emergency >add numbers. అన్‌లాక్ చేసే సమయంలో ఎమర్జెన్సీ కాల్ క్లిక్ చేస్తే వీరి నంబర్స్ వస్తాయి.
Sorry, no posts matched your criteria.