News October 28, 2025

మునగ సాగు.. ఏటా రూ.40 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 28, 2025

మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

image

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

News October 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 49

image

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 28, 2025

అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

image

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.

News October 28, 2025

CCRHలో 31 పోస్టులు..

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి 31 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నవంబర్ 6 నుంచి 10 వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్ పోస్టులకు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in/

News October 28, 2025

‘మొంథా’ తుఫాను UPDATES

image

➤ విశాఖ, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం.. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
➤ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
➤ విశాఖకు వచ్చే 16రైళ్లు రద్దు
➤ 11 జిల్లాల్లో 6 లక్షల హెక్టార్ల పంటలపై తుఫాను ప్రభావం!
➤ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 787మంది గర్భిణులు సమీప ఆస్పత్రులకు తరలింపు
➤ సహాయక చర్యలకు సిద్ధమైన తూర్పు నౌకాదళం.. సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు రెడీ

News October 28, 2025

టీచర్ల బదిలీలకు భారీగా దరఖాస్తులు

image

TG: 317 జీవో కింద స్థానికత కోల్పోయిన టీచర్ల బదిలీలకు దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 6,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని డీఈవోలు పరిశీలించాక ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపిస్తారు. ఉద్యోగుల స్థానికత, కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, ఇతర కారణాలపై 3-4 రోజుల్లో స్క్రూటినీ పూర్తికానుంది. వచ్చిన దరఖాస్తుల్లో సగం అప్లికేషన్లు మాత్రమే నిబంధనల ప్రకారం అర్హత సాధించే అవకాశం ఉందని సమాచారం.

News October 28, 2025

అవసరం లేని రూట్లలో బస్సులు నిలిపివేయండి: RTC MD

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలివేయాలని అధికారులను RTC MD తిరుమలరావు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లోనే సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్‌లు ఉంచొద్దని, ముంపునకు అవకాశమున్న కాల్వలు, కాజ్ వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దన్నారు. దూరప్రాంత సర్వీసులనూ రద్దీని బట్టే నడపాలని చెప్పారు.

News October 28, 2025

పిల్లలకు ఆన్‌లైన్ లిటరసీ నేర్పిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్‌ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు. సోషల్‌మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చెప్పాలి. ఆ పరిచయాలతోపాటు ఆఫ్‌లైన్‌లో దొరికే మానవసంబంధాల ప్రాధాన్యతనూ వారికి వివరించాలంటున్నారు.

News October 28, 2025

తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.