India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై ‘జెర్సీ’ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్ సేవలు దారుణమని ట్వీట్ చేశారు. కస్టమర్ కేర్ నుంచి ఎవరైనా తనకు కాల్ చేసి, వారు సృష్టించిన గందరగోళాన్ని పరిష్కరించాలని కోరారు. 31 రోజులైనా తన సమస్యను పరిష్కరించలేదని, చాలా కోపంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆయన తండ్రి ఎర్రన్నాయుడు పేరుతో ఉండేది. కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా రామ్మోహన్ నాయుడు దీన్ని అభివర్ణించారు.

TG: కేంద్రమంత్రిగా HYDకు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. మోదీ నుంచి రూ.లక్షన్నర కోట్లు ఇప్పిస్తే పది లక్షల మందితో సన్మానిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీనది సుందరీకరణకు కలిపి రూ.70 వేల కోట్లు కావాలని, వాటి కోసం కిషన్ రెడ్డి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏడ్చేవాళ్ల గురించి తమకు బాధలేదని, అభివృద్ధితో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

కెనడా తమ దేశంలో కలిసిపోవాలని ఆ దేశ ప్రధాని ట్రూడోకి అమెరికా ‘ప్రెసిడెంట్ ఎలక్ట్’ ట్రంప్ తాజాగా సూచించారు. ట్రూడో తాజాగా అమెరికాలో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమపై సుంకాలు పెంచొద్దని ఆయన్ను విజ్ఞప్తి చేశారు. ‘మా నుంచి వాణిజ్యంలో రూ.100 బిలియన్ డాలర్లు దోచుకుంటే కానీ మీ దేశం మనుగడ సాగించలేదా? అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి. మీరు దాని గవర్నర్‌గా ఉండండి’ అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు.

గుజరాత్ జట్టు ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అక్కడ మిస్ అయినా, దేశవాళీ టీ20 టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్’లో పటేల్ రికార్డులు తిరగరాస్తున్నారు. 6 రోజుల క్రితం త్రిపుర మీద 28 బంతుల్లో సెంచరీ చేసిన ఆయన ఈరోజు ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో శతకం కొట్టారు. దీంతో ప్రపంచంలో టీ20ల్లో 40 బంతుల్లోపు రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు.

AP: ఆర్టీసీ ప్రయాణికులకు APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ శుభవార్త చెప్పారు. కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా నడుపుతామని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ప్రకటించి, పథకం అమలు చేస్తామని వివరించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఆప్, పొలిటికల్ కన్సల్టెన్సీ I-PAC మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో ఆప్‌తో కలిసి ఐప్యాక్ పనిచేసింది. అప్పుడు 70 స్థానాల్లో 62 చోట్ల ఘన విజయాన్ని అందుకుంది. ఢిల్లీని ఆప్ పదేళ్లుగా పాలిస్తోంది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి. వీటిని అధిగమించి కేజ్రీవాల్ సెంట్రిక్‌గా ఐప్యాక్ ప్రచారం ఉంటుందని తెలుస్తోంది.

విడుదలకు ముందు పుష్ప-2 మూవీకి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 5న త్రీడీలో రిలీజ్ అవట్లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ప్రింట్లు రెడీ కాకపోవడమే దీనికి కారణమని తెలిపాయి. అయితే ఈ నెల 13నుంచి 3D వెర్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శరద్ పవార్‌కు మరిన్ని తలనొప్పులు మొదలయ్యేలా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడంతో అజిత్ పవార్ వర్గం నుంచి కొందరు నేతలు SR పవార్ పార్టీలో చేరారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పార్టీ ఘన విజయంతో వెళ్లిపోయిన నేతలు తిరిగొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆయనతో మాట్లాడారని వార్తలొస్తున్నాయి. మరికొందరు MPలు నేరుగా ఫడణవీస్‌ను సంప్రదించారని సమాచారం.

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5,827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.3,500 కోట్లతో రోడ్ల అభివృద్ధి, ఏడు ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ ఇంటర్‌ఛేంజ్ పనులకు శంకుస్థాపన చేశారు. తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రూ.45 కోట్లతో 19 రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Sorry, no posts matched your criteria.