India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామని తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ డీలాపడడంతో INDIA కూటమి సారథ్య బాధ్యతలపై మిత్రపక్షాలు కన్నేశాయి! బెంగాల్ CM మమతా బెనర్జీ ఈ జాబితాలో ముందున్నారు. కూటమిని నడిపించగల సామర్థ్యం ఆమెకుందని TMC నేతలు వాదిస్తున్నారు. BJPని ఓడించే విషయంలో కాంగ్రెస్ కంటే ఘనమైన రికార్డు ఆమె సొంతమని చెబుతున్నారు. అయితే కూటమికి మమతా సారథ్యం ప్రతిపాదన ఓ పెద్ద జోక్ అని కాంగ్రెస్ కొట్టిపారేసింది.

AP: ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

‘పుష్ప-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినిమాలో కీలక పాత్రలు పోషించిన సునీల్, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ వంటి నటులు ఈవెంట్లో కనిపించలేదు. దీంతో వీరంతా ఎందుకు రాలేదన్న చర్చ మొదలైంది. మరోవైపు వేరే సినిమా షూటింగ్స్‌లో వారు బిజీగా ఉండొచ్చని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

AP: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. ఐటీ, గ్లోబల్ కాంపిటీటీవ్ సెంటర్స్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. యువతీయువకులకు భరోసా కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ మారిటైం పాలసీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపినట్లు వివరించారు.

హిందువులు, ఇతర మైనారిటీలను బంగ్లాలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం హత్య చేయిస్తోందని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన ఆవామీ లీగ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. ‘ఆలయాలు, చర్చిలు, ఇస్కాన్‌పై యూనస్ ప్రభుత్వ దాడుల్ని ఖండిస్తున్నా. నేను జనాన్ని చంపించానంటూ లేనిపోని ఆరోపణల్ని మోపారు. నిజమేంటంటే.. విద్యార్థి సమన్వయకర్తలతో కుట్ర పన్ని ఆ దారుణాలు చేస్తోంది యూనసే’ అని మండిపడ్డారు.

భారత టెస్టు కెప్టెన్సీలో రోహిత్ శర్మకు జస్ప్రీత్ బుమ్రా సరైన వారసుడని భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘దీర్ఘకాల కెప్టెన్సీకి బుమ్రాయే సరైన ఆప్షన్. అందులో ఎలాంటి డౌట్ లేదు. స్వదేశంలో సిరీస్ ఓటమి ఒత్తిడి అనంతరం ఆస్ట్రేలియా వంటి చోట సిరీస్‌లో తొలి టెస్టునే గెలిపించడం చిన్న విషయం కాదు. బుమ్రాకి సామర్థ్యం ఉంది. పైగా తనెప్పుడూ జట్టుకోసమే ఆలోచించే వ్యక్తి’ అని కొనియాడారు.

మహీంద్రా కొత్త విద్యుత్ కార్లకు XEV 9e, BE 6e అని పేర్లు పెట్టింది. అయితే 6E పేరిట ఇండిగో సంస్థ తమ ఎయిర్‌లైన్స్, వసతుల్ని బ్రాండింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘6E’ వాడకూడదంటూ మహీంద్రాపై ఇండిగో దావా వేసింది. అటు మహీంద్రాకు ఇప్పటికే ‘BE 6E’కి వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ట్రేడ్‌మార్క్ లభించడం గమనార్హం. ఈ నేపథ్యంలో చర్చలకు రమ్మని ఇండిగోను మహీంద్రా సంస్థ కోరినట్లు తెలుస్తోంది.

AP: ఆస్తులు లాగేసుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్‌గా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. కాకినాడ పోర్టును కేవీ రావుకు 41శాతం ఇచ్చి, అరబిందో 59శాతం లాక్కుందని అన్నారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. పథకాలపై అభిప్రాయాల సేకరణ చేయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియాలను అరికడతామని చెప్పారు.

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో పయనించాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, IT షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతు బెంచ్ మార్క్ సూచీల గెయిన్స్‌కు దన్నుగా నిలిచాయి. Sensex 597 పాయింట్ల లాభంతో 80,845 వద్ద, Nifty 181 పాయింట్ల లాభంతో 24,457 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు Sensexలో 80,900 వద్ద, నిఫ్టీలో 24,480 పరిధిలో ఉన్న కీలక Resistance సూచీలను తదుపరి ముందుకు కదలనివ్వలేదు.
Sorry, no posts matched your criteria.