News October 28, 2025

ప్రతి ఊర్లో హనుమాన్ ఆలయం ఎందుకు ఉంటుంది?

image

హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, నిస్వార్థ భక్తికి ప్రతీక. ప్రజలు ఆయనను కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా నమ్ముతారు. రాముని సేవలో ఆయన చూపిన నిష్ఠ కారణంగా ఆయన్ని ఎక్కడ పూజించినా రాముని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే గ్రామాన్ని, ప్రజలను రక్షించే రక్షక దేవతగా ప్రతి ఊరిలో ఆయన ఆలయాన్ని నిర్మించడం భారతీయ సంప్రదాయంగా మారింది. ఆయనను పూజిస్తే ధైర్యం, బలం లభిస్తాయని నమ్ముతారు.

News October 28, 2025

దూసుకొస్తున్న తుఫాను.. బయటికి రావొద్దు!

image

AP: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ‘మొంథా’ తుఫాను గడిచిన 6గంటల్లో 15Kmph వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 280km, కాకినాడకు 360km, విశాఖపట్నంకి 410km దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

News October 28, 2025

ఆర్టీసీలో 1,743 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.tgprb.in/

News October 28, 2025

చైనాలో ‘రీల్’ చేయాలంటే.. డిగ్రీ ఉండాల్సిందే!

image

డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియా రీల్స్ చేసేలా చైనా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ వంటి అంశాలపై వీడియోలు చేయాలంటే ఆయా సబ్జెక్టులపై వారు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే SM ప్లాట్‌ఫామ్స్ కూడా వారి డిగ్రీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటించని వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ.12 లక్షల వరకు ఫైన్ విధిస్తారు.

News October 28, 2025

నేడు అత్యంత భారీ వర్షాలు

image

AP: ‘మొంథా’ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. దీంతో నేడు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం-నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సాయంత్రం/రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 90-110Kmph వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

News October 28, 2025

మార్చి మూడో వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.

News October 28, 2025

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.

News October 28, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.

News October 28, 2025

ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

image

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

News October 28, 2025

‘జీర్ణం వాతాపి జీర్ణం’ అని ఎందుకంటారు?

image

ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ప్రయాణికులను మోసం చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారి, వంటగా వడ్డింపబడి, భోజనం తర్వాత కడుపు చింపుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అగస్త్యుడు ఓనాడు వాతాపిని తిన్నాడు. ఇల్వలుడు వాతాపిని పిలవగా అగస్త్యుడు వాతాపి ఎప్పుడో జీర్ణమయ్యాడంటూ కడుపును రుద్దుతూ ‘జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీని ఆధారంగా తిన్నది బాగా జీర్ణం కావాలని ఇలా చెప్పడం అలవాటుగా మారింది. <<-se>>#DHARMASANDEHALU<<>>