News December 9, 2024

12 నెలల్లో 12 ఏళ్ల వ్యతిరేకత: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 12 ఏళ్ల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాలనలో BRSకు కాంగ్రెస్‌కు తేడా లేదని చెప్పారు. ప్రజల బతుకు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందన్నారు. రేవంత్ పాలనకు పాస్ మార్కులిచ్చే పరిస్థితే లేదని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు, ఇల్లు కూడా ఇవ్వలేని వారు విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు.

News December 9, 2024

శాంతిభ‌ద్ర‌త‌లే ఆప్‌ ఎన్నిక‌ల అజెండా!

image

ఢిల్లీలో లా అండ్ ఆర్డ‌ర్‌ను ఆప్ ఎన్నిక‌ల అజెండాగా మార్చుకుంటున్నట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస హ‌త్య‌లు, వేల కోట్ల డ్ర‌గ్స్ రాకెట్ అంశాల చుట్టూ ఆప్ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో ప‌నిచేస్తారు కాబ‌ట్టి అమిత్ షాను టార్గెట్‌ చేస్తోంది. చైన్‌, ఫోన్ స్నాచింగ్‌, ఎక్స్‌టార్ష‌న్స్, మ‌హిళ్ల‌లో అభ‌ద్ర‌తా భావానికి కేంద్రం వైఫల్యాలే కారణమంటూ విమర్శిస్తోంది.

News December 8, 2024

నిద్ర పోయేటప్పుడు ఇలా చేస్తున్నారా?

image

పడుకునే సమయంలో చాలా మంది దోమల బెడదను తప్పించుకునేందుకు దోమల నివారణ యంత్రాలను వాడుతారు. వీటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు వెలువడుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీంతో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇవి కాస్త క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కర్పూరం పొగ, వేపాకులను కాల్చడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News December 8, 2024

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

image

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

News December 8, 2024

రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడు: ఇల్తిజా

image

రాముడి పేరు నిన‌దించలేద‌న్న కార‌ణంతో ముస్లిం యువ‌కుల‌ను హింసించ‌డం లాంటి ఘ‌ట‌న‌ల‌తో రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడ‌ని PDP నాయ‌కురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న‌పై ఆమె స్పందిస్తూ ఇలాంటి స‌మ‌యాల్లో రాముడు సైతం నిస్స‌హాయంగా ఉండిపోతార‌ని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడ‌గొడుతూ ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌ను ప‌ట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.

News December 8, 2024

భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక

image

AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.

News December 8, 2024

కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే

image

TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.

News December 8, 2024

చైతూ భర్తగా రావడం నా అదృష్టం: శోభిత

image

నాగ చైతన్య సింప్లిసిటీ, మంచి మనసు తనను ఆకట్టుకున్నాయని భార్య శోభితా ధూళిపాళ వెల్లడించారు. అలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను హుందాగా, ప్రశాంతంగా ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురుచూశానో అది చైతూ నుంచి దక్కిందన్నారు. తనను జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపారు. ఈ ప్రేమ జంట ఈ నెల 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.

News December 8, 2024

రేవంత్ ఏడాది పాటు వారి కోసమే పనిచేశారు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు అందరిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో 60% పైన ప్రజలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూసీ వెనుక మూటల దోపిడీ ఉందని దుయ్యబట్టారు. రేవంత్ ఈ ఏడాది పాలనలో అదానీ, బావమరిది, బ్రదర్స్ కోసమే పనిచేశారని ఆరోపించారు.

News December 8, 2024

క్రికెట్ ఫ్యాన్స్‌కు SAD DAY

image

టీమ్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇవాళ బాధాకరమైన రోజుగా మిగిలింది. భారత జట్టు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పురుషుల జట్టు ఓటమి పాలైంది. AUSతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం చవిచూసింది. అండర్-19 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో యువ భారత్ ఓటమి పాలైంది. దీంతో ఈరోజు SAD DAY అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.