News April 10, 2025

IPL: కెప్టెన్‌గా ధోనీ ట్రాక్ రికార్డు

image

ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ పలు రికార్డులు కలిగి ఉన్నారు.
* అత్యధిక విజయాలు-133 మ్యాచులు
* అత్యధిక విన్నింగ్ శాతం: 58.9%
* ఐపీఎల్ ట్రోఫీలు-5(రోహిత్‌తో కలిసి)
* అత్యధిక సార్లు ప్లేఆఫ్ ఎంట్రీ-12
* అత్యధిక సార్లు ఫైనలిస్ట్-10

News April 10, 2025

లోకో పైలట్లకు నో బ్రేక్స్: రైల్వేశాఖ

image

డ్యూటీలో ఉండగా భోజనానికి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు లోకో పైలట్లకు విరామ సమయాన్ని కేటాయించాలన్న విజ్ఞప్తిని రైల్వే శాఖ తిరస్కరించింది. రైలు ప్రమాదాలు పెరుగుతుండడం, వాటిలో చాలా వరకు మానవ తప్పిదాలే కారణమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పైలట్ల క్యాబిన్లలో వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకుంది. దీనివల్ల సిబ్బంది ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.

News April 10, 2025

30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

image

TG: పేదలకు సన్నబియ్యం న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే సన్నబియ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి MLA తమ నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించాలని సూచించారు. త్వరలోనే 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

News April 10, 2025

ఊహించని ప్రమాదం.. 218 మంది మృతి

image

డొమినికన్ రిపబ్లిక్‌లో నైట్ క్లబ్‌ <<16049528>>పైకప్పు కూలిన<<>> ఘటనలో మృతుల సంఖ్య 218కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. 150 మందికి పైగా ప్రాణాలతో కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా తమవారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలు ఇవ్వకపోవడంతో అధికారులపై మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

News April 10, 2025

ట్రేడ్ వార్.. భయం లేదంటున్న చైనా

image

తమ దేశ ఉత్పత్తులపై అమెరికా 125% టారిఫ్ విధించడంపై చైనా స్పందించింది. యూఎస్ కవ్వింపు చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. అలాగే చైనాలో ప్రదర్శించే యూఎస్ సినిమాల సంఖ్యను తగ్గించనున్నట్లు చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

News April 10, 2025

రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

image

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

News April 10, 2025

కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

image

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.

News April 10, 2025

KOHLI: మరో 2 బౌండరీలు బాదితే చరిత్రే

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరో 2 బౌండరీలు బాదితే IPLలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో ధవన్(920), డేవిడ్ వార్నర్(899), రోహిత్ శర్మ(885) ఉన్నారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.

News April 10, 2025

గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను A, B, C కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు, 2501-3500 జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు, 3501కి పైగా జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్‌లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.

News April 10, 2025

ALERT: పరీక్ష తేదీ మార్పు

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్ష తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో పరీక్షను మరుసటి రోజు 21కి మార్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని విద్యాశాఖ సూచించింది. www.cse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.