India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 4వ ప్లాట్‌ఫామ్‌పై దొరికిన అరటిపండు కోసం రెండు కోతులు కొట్టుకున్నాయి. కోపంలో ఓ కోతి మరో కోతిపైకి రబ్బరు వస్తువును విసిరింది. అది కాస్తా ఓ విద్యుత్ వైరుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి వైరు ఊడి ఆగి ఉన్న రైలు బోగీపై పడింది. దీంతో ఆ స్టేషన్‌కి రైళ్ల రాకపోకలు గంటసేపు నిలిచిపోయాయి. ఇదంతా చేసిన కోతులు చక్కగా అరటిపండుతో పరారయ్యాయి.

ప్రధాన టెలికం కంపెనీలు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా(VI)కు షాక్ తగిలింది. జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో 55 లక్షల మంది మొబైల్ నంబర్ పోర్టింగ్ ద్వారా బీఎస్ఎన్ఎల్కు మారారు. ఇతర టెలికం కంపెనీలు రీఛార్జ్ రేట్లు భారీగా పెంచడంతో BSNLవైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి సంఖ్య తగ్గింది.

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు తీయకుండా రేవంత్‌కు గానీ కాంగ్రెస్ నేతలకు గానీ పూట గడవదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది కాలంలో తమ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఎన్నికల ఫలితాలతో ఎవరెవరు ఎలాంటి వారో తెలిసిందన్నారు. కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఆయన ఫామ్‌హౌస్‌కు పరిమితం కాలేదని, అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

APలో నిన్న జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌పై YCP అధినేత జగన్ స్పందించారు. ‘సహజంగా జరిగే ఈ సమావేశాలు ఇప్పుడే జరుగుతున్నట్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తే ఆశ్చర్యమేస్తోంది. మా హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన స్కూళ్లను, విద్యారంగాన్ని నాశనం చేస్తూ, అమ్మకు వందనం ఇవ్వకుండా దగా చేశారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం’ అని ఆయన ట్వీట్ చేశారు.

నాగచైతన్య-శోభితల వివాహం ఈ నెల 4న అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించి మరికొన్ని ఫొటోలను శోభిత పంచుకున్నారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ తలంబ్రాల బట్టలు ప్రధానం చేయడం, తలంబ్రాలు వేయడం, అరుంధతీ నక్షత్రం చూపించడం వంటి సందర్భాల ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

TG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలతో పాటు గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు.

AP: విశాఖలో దొరికిన కంటైనర్‌లో డ్రగ్స్ లేవని <<14811211>>సీబీఐ <<>>నిర్ధారించడంపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. ‘చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్‌లో డ్రగ్స్ దొరికిందని పోలింగ్‌కు నెలన్నర ముందు ఓటర్లను మోసం చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింక్ పెట్టి మరీ అప్పుడు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు’ అని VSR డిమాండ్ చేశారు.

AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

NDA ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థలు, జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ హస్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.

‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.