News September 6, 2024

త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు!

image

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటరుకు రూ.4 నుంచి రూ.6 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్‌లో మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకూ ధరలు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.

News September 6, 2024

పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా: మహేశ్ కుమార్

image

కాంగ్రెస్ అధిష్ఠానం తనకు TPCC చీఫ్‌ బాధ్యతలు అప్పగించడంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్దేశానుసారం, సీనియర్ల మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల సేవలో పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

News September 6, 2024

భారీగా తగ్గిన నాన్‌వెజ్ థాలీ ధరలు

image

శాకాహార భోజనం ధరలు జులైతో పోలిస్తే ఆగస్టులో 8 శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే నాన్‌వెజ్ భోజనం ధరలు 12 శాతం తగ్గినట్లు పేర్కొంది. టమాటా, ఎల్పీజీ, అందులో వినియోగించే సరకుల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు చికెన్ ధరలు భారీగా 50 శాతం తగ్గడంతో నాన్‌వెజ్ థాలీ ధరలు దిగి వచ్చినట్లు వెల్లడించింది.

News September 6, 2024

ఆర్టికల్-370 ముగిసిన అధ్యాయం: అమిత్ షా

image

ఆర్టికల్-370 అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటనలో స్పష్టం చేశారు. దాన్ని తిరిగి తీసుకురావడం జరగదని తేల్చిచెప్పారు. 370వ అధికరణను తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడంతో షా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా.. జమ్మూకశ్మీర్‌లో 2014 తర్వాత తొలిసారిగా ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెల్లడవుతాయి.

News September 6, 2024

DSC ఫైనల్ ‘కీ’ విడుదల

image

TG: డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి.

News September 6, 2024

బిడ్డకు జన్మనిచ్చిన హీరో నితిన్ భార్య

image

టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ‘మా కుటుంబంలోకి కొత్త తారకు స్వాగతం’ అంటూ ఆయన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్ర‌మంలో అతడి ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నితిన్ 2020 జులైలో షాలినిని వివాహమాడారు. అటు ‘తమ్ముడు’ టైటిల్‌లో ఆయన ఓ సినిమా చేస్తున్నారు.

News September 6, 2024

ఏపీ మాదిరి మాకూ సాయం చేయండి: రేవంత్

image

TG: 2 రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ను CM రేవంత్ కోరారు. ‘వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ పంట నష్టం వాటిల్లింది. వరద నష్టం రూ.5,438 కోట్లుగా అంచనా వేశాం. తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ కోసం నిధులు ఇవ్వండి. APకి ఎలా సాయం అందిస్తారో మాకూ అలాగే చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.

News September 6, 2024

OFFICIAL: రాజస్థాన్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

image

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. ఇందుకు సంబంధించి వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ నుంచి ఆయన జెర్సీ అందుకున్నారు. కాగా 2012, 13 సీజన్లలో ద్రవిడ్ ఆర్ఆర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014, 15 సీజన్లలో ఆ జట్టు మెంటార్‌గా సేవలందించారు.

News September 6, 2024

సోనియా ముందుకు ఆ ఇద్ద‌రి పేర్లు

image

T.PCC చీఫ్ ఎంపిక‌ విషయంలో మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మ‌ధుయాష్కీ గౌడ్ పేర్ల‌ను సోనియా గాంధీకి పంపిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్న దానిపై రాష్ట్ర, AICC నేత‌ల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో నిర్ణయాన్ని సోనియాకు వదిలేశారు. మ‌హేశ్ NSUI నుంచి క్రియాశీల‌కంగా ఉండ‌డంతో కింది స్థాయి నేతల్ని కలుపుకొనిపోగలరన్న నమ్మకంతో సోనియా ఆయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

News September 6, 2024

అభిమానులకు తమన్ విజ్ఞప్తి

image

గేమ్‌ఛేంజర్ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ రెండు రోజులుగా నెట్టింట SVC ప్రొడక్షన్ హౌస్‌ను తిడుతూ చేస్తున్న నెగటివ్ ట్రెండ్‌పై ఆ మూవీ సంగీత దర్శకుడు తమన్ ట్విటర్‌లో స్పందించారు. ‘మీరు సినిమా అప్‌డేట్ కోసం చాలాకాలంగా చూస్తున్నారని తెలుసు. కానీ మాకు మీ మద్దతు కావాలి. సినిమాలు, సమాజం కోసం చాలా చేసినవారిని బాధించేలా హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ చేయొద్దు. ఇది నా విజ్ఞప్తి. లవ్‌ యూ ఆల్’ అని పోస్ట్ చేశారు.