India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*ఘనంగా దసరా వేడుకలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
*అనారోగ్యంతో ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
*సోమవారం నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం అలర్ట్
*పరువు లేని నాగార్జున పరువు నష్టం దావా వేయడమా?: సీపీఐ నారాయణ
*తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
*బీజేపీ ఉగ్రవాదుల పార్టీ: ఖర్గే ధ్వజం
*బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. DEC 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి మలయప్పస్వామికి తిరుచ్చిపల్లకి సేవ నిర్వహించారు. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం ఘట్టాన్ని పండితులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు.
AP: కర్నూలు(D) దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి( కర్రల సమరం) సర్వం సిద్ధమైంది. మాళమ్మ, మల్లేశ్వరస్వామికి అర్ధరాత్రి 12గంటలకు కళ్యాణం జరిపించిన అనంతరం విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. CCTVలు, డ్రోన్లతో నిఘా, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.
దేశంలో OTTలలో చూపుతున్న కంటెంట్ నైతిక అవినీతి (Moral Corruption)కి కారణమవుతోందని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘OTTలలో చూపే విషయాలు అసహ్యంగా ఉంటాయి. వాటి గురించి మాట్లాడినా అసభ్యకరంగా ఉంటుంది. నైతిక అవినీతికి ఇదీ ఒక కారణం. కాబట్టి దీన్ని చట్ట ప్రకారం నియంత్రించాలి. సోషల్ మీడియా ఉన్నది అశ్లీలత, అసభ్యత వ్యాప్తి చేయడానికి కాదు’ అని పేర్కొన్నారు.
ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది.
*టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297)
*టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్ (297)
*భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22)
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 100- 7.2 ఓవర్లలో
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 200- 13.6 ఓవర్లలో
తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్‌స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్‌బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్‌బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.
కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ను శత్రువులా భావించవద్దని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావడానికి సమయం వచ్చేసింది. మేము కేవలం కశ్మీరీ పండిట్ల గురించే కాకుండా జమ్మూ ప్రజల గురించి కూడా ఆలోచిస్తాం. మనం అందరం భారతీయులం. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 10 రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన సాయిబాబా ఈ ఏడాది మార్చిలో విడుదల అయ్యారు. తూ.గో. జిల్లా అమలాపురంలో జన్మించిన సాయిబాబా పోలియో కారణంగా ఐదేళ్ల వయసు నుంచి వీల్ చైర్ ఉపయోగిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో రామ్ పోతినేని ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేశ్ బాబు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం కాగా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో మూవీ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది.
Sorry, no posts matched your criteria.