India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈరోజు భారత్‌ను ఆస్ట్రేలియా రెండు వేర్వేరు మ్యాచుల్లో ఓడించింది. ఓవైపు అడిలైడ్ టెస్టులో గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిస్బేన్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల్ని ఆస్ట్రేలియా ఉమెన్ ఓడించారు. 372 రన్స్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ 44 ఓవర్లలో 249కి ఆలౌటైంది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

హరియాణాలోని గురుగ్రామ్‌లో DLF కామెలియాస్‌లో ఓ పెంట్ హౌస్ అపార్ట్‌మెంట్ (16,290 sq ft) ₹190కోట్లకు అమ్ముడైంది. ఒక్క sq ft ₹1.8లక్షలు పలికి దేశంలోనే అత్యధిక ధర పలికిన ఫ్లాట్‌గా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దీనిని ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ డైరెక్టర్ రిషి పార్తీ కొన్నారు. కార్పెట్ ఏరియాల్లో ఈ ధరే అత్యధికమని, ముంబైలో sq ftకి ₹1,62,700 ఉండొచ్చని రియల్ ఎస్టేట్ అనలిస్టులు చెబుతున్నారు.

AP: ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను డీజీపీ, HRC సీరియస్‌గా తీసుకోవాలన్నారు. VSR, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని విజయసాయి విమర్శించిన విషయం తెలిసిందే.

మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర <<14823100>>ఫిర్యాదులు<<>> చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. బాలయ్య పాత్రను మాస్ మహారాజా పరిచయం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని టాలీవుడ్ టాక్. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TG: ఏడాది పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని CM రేవంత్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, 55,000 జాబ్స్ అందించామని, 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని ట్వీట్ చేశారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రేమకు వయసుతో సంబంధం లేదనే మాటను USకు చెందిన ఓ వృద్ధజంట నిరూపించింది. మార్జొరీ ఫిటర్‌మాన్ అనే 102 ఏళ్ల వృద్ధురాలు, బెర్నీ లిట్‌మాన్ అనే 100 ఏళ్ల వృద్ధుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో 2024 మేలో ఒక్కటయ్యారు. దీంతో ఓల్డెస్ట్ న్యూలీవెడ్ కపుల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని GWR తాజాగా ప్రకటించింది.

నితీశ్ కుమార్ రెడ్డి పేరు నెట్టింట మారుమోగుతోంది. అనుభవజ్ఞులతో కూడిన భారత జట్టులో ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ ఆడుతున్న అతనొక్కడే పోరాడటం దీనిక్కారణం. తొలి టెస్టులో 41, 38, రెండో టెస్టులో 42, 42 రన్స్‌తో జట్టును నితీశ్ ఆదుకున్నారు. ఇక అడిలైడ్ టెస్టు భారత రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ ఆదుకోకపోతే టీమ్ ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై ఉండేది. నితీశ్ ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో మూడింట అతడే టాప్ స్కోరర్.

మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

TG: రాష్ట్రంలో ఇప్పటికీ 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ₹15వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. ₹4వేల నిరుద్యోగ భృతి, ఏడాదికి 2లక్షల జాబ్స్ వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.