India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో నటించేందుకు ఏదైనా వదులుకోవడానికి తాను సిద్ధమని నటి ప్రియమణి అన్నారు. తాను నటించిన ‘మైదాన్’ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ‘ఒకవేళ షారుఖ్ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే ఏదైనా వదులుకొని ఆయన దగ్గరికి వెళతా. ఈ విషయాన్ని మీడియానే ఆయన దగ్గరికి తీసుకెళ్లాలి’ అని కోరారు. కాగా.. 2023లో ఆమె ‘జవాన్’లో షారుఖ్‌తో కలిసి నటించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోనూ ఓ సాంగ్‌లో ఆయనతో స్టెప్పులేశారు.
AP: రెండురోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా మహేశ్ విజయవాడ వెస్ట్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో జనసేనకు రాజీనామా చేశారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. నిన్న శ్రీవారిని 55,756 మంది దర్శించుకోగా.. 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు సమకూరింది.
AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారట. ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాల విడుదల ఒకట్రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
TG: రాష్ట్రంలో నీటి సరఫరాపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ వరకు నీటి సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడిని గుర్తించామంది. 67 మున్సిపాలిటీల్లో తక్కువ నీటి సరఫరా ఉన్నట్లు తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. అత్యవసర పనులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
వైవిధ్యభరిత సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. తనకు మెమొరీ పవర్ తక్కువ అని, ఆ కారణం వల్లే తెలుగు నేర్చుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలుగు వచ్చి ఉంటే.. చెన్నై నుంచి వచ్చేసి ఇక్కడే తెలుగులో సినిమాలు చేసేవాడినని అన్నారు. విజయ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ ‘లవ్ గురు’ ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో విజయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
TG: BRS అధ్యక్షుడు, మాజీ సీఎం KCR ఈనెల 13న చేవెళ్ల సభ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా బస్సు యాత్ర ఉండనుందట. మరోవైపు వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన భోపాల్‌లోని జాతీయ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారు ఐదేళ్లపాటు అత్యున్నత ధర్మాసనంలో సేవలందించిన అనిరుద్ధ బోస్.. ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు.
TG: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవకు.. సీఎం రేవంత్ ఒకప్పుడు సన్నిహితుడు. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికేతరుడికి ఎలా టికెట్ ఇస్తారంటూ కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నట్లు టాక్.
AP, తెలంగాణలో వచ్చే 3,4రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని మంచిర్యాల, నిర్మల్, NZB, ADB, ఆసిఫాబాద్, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. APలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. నిన్నటి నుంచే ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు.
Sorry, no posts matched your criteria.