India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోహిత్ శెట్టి డైరెక్షన్లో అజయ్ దేవగణ్ హీరోగా ‘సింగం అగైన్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో ఒరిజినల్ సింగం సూర్య, ప్రభాస్ క్యామియో రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ప్రభాస్ యాక్షన్ జాక్సన్ సినిమాలో, సూర్య సర్ఫిరా మూవీలో గెస్ట్ రోల్స్ చేశారు.
రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఇది రిలీజ్ అవుతుంది. ఆగస్టు15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు విచారణకు సీబీఐ తరఫు లాయర్ 40 నిమిషాలు ఆలస్యంగా హైకోర్టుకు వచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది సీబీఐ అలసత్వానికి నిదర్శనం. చాలా దురదృష్టకరం. నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ మంజూరు చేయమంటారా?’ అని మండిపడ్డారు. చివరికి వాదనలు విన్న జడ్జి నిందితుడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపారు
AP: వినాయక చవితి వేళ దారుణం జరిగింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో అర్జునరావు అనే వ్యక్తి మామిడాకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే అడగకుండా ఎందుకు కోస్తున్నావంటూ ఇంటి యజమాని అతడితో గొడవకు దిగాడు. వాగ్వాదం పెరగడంతో అర్జునరావుపై యజమాని కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.
‘దేవర’ ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
గణేశ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే చాలామంది యువతకు ఏ దిశలో విగ్రహం పెట్టాలనే సందేహం ఉంటుంది. వాస్తు ప్రకారం వినాయకుడిని తూర్పు దిశలో ప్రతిష్ఠించడం వల్ల మంచి శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు. తూర్పున సాధ్యం కాకపోతే ఉత్తరం వైపు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అయితే యముని స్థానమైన దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదంటున్నారు.
బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్లో మరో మూవీ పట్టాలెక్కనుంది. ఇది అఖండ-2 అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విలన్‌గా గోపీచంద్‌ను తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు స్టోరీ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ముగ్గురు కాంబోలో మూవీ వస్తే క్రేజీగా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో జయం, నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ విలనిజం పండించారు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ తెలిపారు. అలాగే స్టేటస్‌లలో ఫ్రెండ్స్(కాంటాక్ట్స్)ను ట్యాగ్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్లను డెవలప్ చేస్తున్నామని, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సంస్కర్త రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా నేడు CM రేవంత్ నివాళులర్పించారు. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కల్పించడంలో రావి నారాయణ రెడ్డి సేవలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. భారత దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక ఓట్లతో గెలిచి రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించారని సీఎం పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.