India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫ్రాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా. ట్రావెలింగ్ రిజర్వ్: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.
లెబనాన్‌లోని UN శాంతి పరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల సరిహద్దుల్లోని బ్లూ లైన్ వెంబడి 600 మంది భారత సైనికులు UN శాంతిపరిక్షణ మిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ స్థావరాలను ఇజ్రాయెల్ క్షిపణులు ఢీకొట్టాయి. అయితే, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. UN స్థావరాల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని భారత్ సూచించింది.
ఆడపిల్ల పుట్టిందని తనను తల్లిదండ్రులు భారంగా భావించారని బాలీవుడ్ బ్యూటీ మల్లిక షెరావత్ తెలిపారు. ‘నా సోదరుడిని ఆప్యాయంగా చూసేవారు. అతణ్ని ఉన్నతంగా చదివించాలి, విదేశాలకు పంపించాలనుకునేవారు. ఆస్తులు కూడా తమ్ముడికే చెందాలనుకునేవారు. అమ్మాయిలు ఏం పాపం చేశారు? నన్ను చదివించారు కానీ స్వేచ్ఛనివ్వలేదు. నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్లుంటుంది’ అని నిట్టూర్చారు.
భారత కుబేరుల సంపద మొత్తం కలిపి తొలిసారిగా ట్రిలియన్ డాలర్లను దాటిందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. 2019తో పోలిస్తే వారి సంపద రెట్టింపైందని తెలిపింది. ఒక్క 2023లోనే వారు 316 బిలియన్ డాలర్లను సంపాదించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌గా ఉందని కొనియాడింది. కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ (119.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ(116 బిలియన్ డాలర్లు) 2వ స్థానంలో నిలిచారు.
విమానం టేకాఫ్, ల్యాండింగ్‌లో ల్యాండింగ్ గేర్ అనేది కీలకం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. అంటే విమానాన్ని చక్రాల ద్వారా కాకుండా నేరుగా విమానం మధ్య భాగం (బెల్లీ) భూమిని తాకేలా ల్యాండ్ చేస్తారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చివరి అవకాశంగా దీనికి అనుమతిస్తుంటారు.
‘విశ్వంభర’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ థియేటర్లో విడుదల కానుంది.
AP: జగన్‌పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్‌సేల్‌గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్‌గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.
TG: మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. మీరు చెప్పే విద్యపై మీకే నమ్మకం లేదా? ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చేర్పించాలి’ అని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై మీ కామెంట్?
TG: సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన ఐటీబీపీ ఐజీగా పని చేస్తున్నారు. కాగా 2017లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసును అకున్ సభర్వాల్ పర్యవేక్షించారు. కేసు కీలక దశలో ఉన్నప్పుడు ఆయన కేంద్రానికి వెళ్లిపోవడంతో డ్రగ్స్ కేసు మరుగునపడింది. మళ్లీ ఇప్పుడు ఆయనకు ఏ పోస్ట్ ఇస్తారోనని చర్చ జరుగుతోంది.
బాలీవుడ్లో మరో క్రేజీ సినిమా విడుదలకు సిద్ధమైంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన సింగం ఫ్రాంచైజ్‌లో వస్తున్న సింగం అగైన్ దీపావళి కానుకగా నవంబర్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో దీపిక, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా చుల్బుల్ పాండేగా క్యామియో చేసినట్టు టాక్.
Sorry, no posts matched your criteria.