News December 7, 2024

పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం: VSR

image

AP: Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని YCP MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. జలజీవన్ మిషన్ పథకం పనుల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న వార్తను షేర్ చేశారు. ఈ శాఖలు పవన్ నిర్వహించేవేనని, భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుందనే పవన్‌ను అణచివేయడానికి చంద్రబాబు తన ట్రేడ్‌ మార్కు వ్యూహాలను అమలు చేస్తున్నారని ట్వీట్ చేశారు.

News December 7, 2024

టెన్త్ పూర్తయిన వారికి అవకాశం

image

AP: ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్&ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డ్రోన్ పైలట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్ పూర్తయిన వారు DEC 9 లోపు అప్లై చేసుకోవచ్చు. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెలకు రూ.19వేలతో ఉద్యోగం ఇస్తారు. టూవీలర్ లైసెన్స్ ఉండాలి. DEC 10న గుంటూరులోని ప్రభుత్వ ITI కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాలకు: 8074607278, 99888 53335.

News December 7, 2024

బంగ్లాలో మరో 2 ఆలయాల ధ్వంసం

image

బంగ్లాదేశ్‌లోని ఢాకా జిల్లాలో మరో రెండు గుళ్లను అక్కడి దుండగులు తగలబెట్టినట్లు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు. ‘ఈరోజు తెల్లవారుజాము 2-3 గంటల మధ్య సమయంలో రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలకు నిప్పుపెట్టారు. లక్ష్మీనారాయణుల విగ్రహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆలయాలను, హిందువుల్ని కాపాడేందుకు అక్కడి పోలీసులు, ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News December 7, 2024

నాలుగు రోజుల వ్యవధిలో 2 సార్లు కంపించిన భూమి

image

TG: రాష్ట్రంలో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 4న ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలలో ఈ స్థాయిలో కంపించడం ఇదే తొలిసారి. తాజాగా మహబూబ్‌నగర్‌లో భూమి కంపించడం ప్రజల్లో భయాన్ని తీవ్రం చేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెబుతున్నారు.

News December 7, 2024

నితీశ్ కుమార్‌లో మొద‌లైన టెన్షన్

image

మ‌హారాష్ట్ర ప‌రిణామాలు బిహార్ CM నితీశ్‌ను టెన్ష‌న్ పెడుతున్నాయి. శిండే నాయ‌క‌త్వంలోనే మ‌హాయుతి ఎన్నిక‌ల్ని ఎదుర్కొన్నా మెజారిటీ సీట్లు గెలిచిన BJP CM ప‌ద‌విని అంటిపెట్ట‌ుకుంది. ఇదే కోవ‌లో ప్ర‌స్తుతం బిహార్‌లో JDU కంటే BJP MLAల బ‌లం అధికం. ఈ ప్రాతిప‌దిక‌న 2025లో బీజేపీ గ‌నుక అత్య‌ధిక సీట్లు తీసుకొని, ఎన్నిక‌ల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిస్తే త‌న ప‌రిస్థితి ఏంట‌ని నితీశ్‌ టెన్షన్ పడుతున్నారు.

News December 7, 2024

కేసీఆర్‌తో ఎలాంటి చర్చ జరగలేదు: మంత్రి పొన్నం

image

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించే క్రమంలో ఆయనతో ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. గులాబీ బాస్ కోరిక మేరకు లంచ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్‌ను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

News December 7, 2024

క్యాన్సర్ సెల్స్‌ను నివారించడంలో ఇవి బెస్ట్!

image

క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్‌లో ఉండే సల్ఫారఫేన్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నిర్వీర్యం చేయ‌డంలో సాయ‌ప‌డుతుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు. స్ట్రా బెర్రీ, బ్లూబెర్రీస్, రాస్‌బెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ డ్యామేజ్డ్ క‌ణాలు క్యాన్స‌ర్ క‌ణాలుగా మార‌కుండా నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు, ప‌సుపులో ఉండే క‌ర్కుమిన్ కాంపౌండ్ క్యాన్స‌ర్ సెల్స్ వృద్ధిని నిలిపివేస్తాయని సలహా ఇస్తున్నారు.

News December 7, 2024

ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

image

<<14808552>>తన పేరిట ప్రచారంలో ఉన్న వీడియో<<>> తనది కాదని నటి ప్రగ్యా నగ్రా ట్విటర్లో తెలిపారు. ‘మళ్లీ చెబుతున్నా. ఆ వీడియో నాది కాదు. ఇదో పీడకల అయితే బాగుండేది. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి తప్ప దుర్భరం చేయకూడదు. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలేస్తోంది. నాకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు’ అని సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు.

News December 7, 2024

పృథ్వీ షా తల్లి లేని బిడ్డ: మాజీ కోచ్

image

క్రికెటర్ పృథ్వీ షాపై విమర్శలు అన్యాయమని అతడి చిన్ననాటి కోచ్ రాజు పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారిది చాలా పేద కుటుంబం. పృథ్వీ చాలా కష్టపడ్డాడు. మంచీచెడూ చెప్పేందుకు తల్లి లేదు. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. రోజు ఎలా గడవాలన్న స్థితి నుంచి ఒక్కసారిగా డబ్బు వచ్చిపడటంతో లైఫ్‌ను ఎంజాయ్ చేశాడు. కానీ పాతికేళ్ల కుర్రాడు 40 ఏళ్లవాడిలా ప్రవర్తించాలని అందరూ కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News December 7, 2024

బిహార్‌లో పోటీ ప‌రీక్ష‌ల అభ్య‌ర్థుల ఆందోళ‌న‌

image

బిహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల సరళిని మార్చాల‌ని డిమాండ్ చేస్తూ పోటీ ప‌రీక్ష‌ల ఆశావహులు ఆందోళ‌న‌కు దిగారు. Dec 13న BPSC నిర్వ‌హిస్తున్న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల్లో ఒక పూట ఒకే పేప‌ర్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఖాన్‌, రెహ్మాన్ ఖాన్‌ వంటి కొంద‌రు ప్ర‌ముఖ విద్యావేత్తలు మ‌ద్ద‌తుప‌లికారు. ఆందోళనకారులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడం వివాదాస్పదమైంది.