India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని APCC చీఫ్ షర్మిల అన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1,750కోట్ల ముడుపులపై విచారణ ఎప్పుడని ప్రభుత్వాన్ని Xలో ప్రశ్నించారు. ఆధారాలు, అధికారం దగ్గర పెట్టుకుని చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నాడు జగన్ మాదిరే బాబూ అదానీకి అమ్ముడుపోయారని అర్థమవుతోందన్నారు. తక్షణమే సోలార్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంగ్లండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షల రన్స్ చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. కివీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. క్రికెట్‌కు జన్మనిచ్చిన ENG 1877లో తొలి అధికారిక టెస్ట్ ఆసీస్‌తో ఆడింది. ఇప్పటి వరకు 1,081 టెస్టులు ఆడి 399 గెలుపులు, 327 అపజయాలు నమోదు చేసింది. 355 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్, మెలానియా జోడీ ఓ బంపరాఫర్ ఇచ్చింది! తమతో ప్రత్యేకంగా డిన్నర్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించింది. కాకపోతే చిన్న షరతు పెట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించే ఓ కార్యక్రమానికి డొనేషన్ ఇవ్వాలి. సొంతంగా రూ.8 కోట్లు విరాళం ఇవ్వాలి. లేదా రూ.16.5 కోట్లు విరాళాన్ని సేకరించి అందజేయాలి. కాబోయే ప్రెసిడెంట్లు ఇలా చేయడం USలో ఆనవాయితీ. 2009లో ఒబామా, 2021లో బైడెన్ ఇలాగే చేశారు.

AP: మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా పేరెంట్స్ ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రతి విద్యార్థి మేధావేనని, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పారు. నెల్లూరులో జరిగిన పేరెంట్స్&టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ‘నేను 1972లో టెన్త్ ఫెయిలయ్యా. దీంతో నాలో కసి పెరిగింది. కష్టపడి చదివి డిగ్రీ, PGలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా మారా’ అని గుర్తుచేసుకున్నారు.

TG: మాజీ మంత్రి హరీశ్‌రావును రీజినల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ సర్వే నిర్వహిస్తోందని వివరించారు. పత్రాలపై బలవంతంగా సంతకాలు సేకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా తక్కువ ధరకే భూములు లాక్కుంటున్నారని, అండగా నిలబడాలని కోరారు. తాము అండగా ఉంటామని హరీశ్ భరోసా ఇచ్చారు.

అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయంపై <<14814040>>విమర్శలు<<>> చేసిన జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్‌పై ఆయన ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సాయం ముష్టిగా కనపడుతోందా? అని మండిపడుతున్నారు. ‘తక్షణ సాయంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటానని వీడియోలో స్పష్టంగా భరోసా ఇచ్చారు. మీలాంటి వారు అభిమానుల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితి తీసుకురాకూడదు’ అని పేర్కొంటున్నారు.

అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి 191/4 స్కోర్ చేశారు. క్రీజులో ట్రావిస్ హెడ్(54), మిచెల్ మార్ష్(2) ఉన్నారు. ఖవాజా 13, నాథన్ 39, లబుషేన్ 64, స్టీవ్ స్మిత్ 2 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా 3 వికెట్లు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 11 పరుగుల లీడ్‌లో ఆసీస్ ఉంది.

AP: హీరో అల్లు అర్జున్‌పై జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరి తీవ్ర విమర్శలు చేశారు. ‘నీకు సినిమాకు రూ.300 కోట్ల రెమ్యునరేషన్ కావాలా? కలెక్షన్లు రూ.2వేల కోట్లు ఉండాలా? నీ మూవీకి వచ్చి బలైన కుటుంబానికి కేవలం రూ.25 లక్షలు ఇస్తావా? నీకు, నీ నిర్మాతలకు సిగ్గు శరం, ఉచ్చనీచం ఉందా? మిమ్మల్ని మనుషులంటారా? మానవత్వం ఉందా? కేసు మాఫీ కోసం ముష్టి వేశారా?’ అని ట్వీట్ చేశారు.

పుష్ప-2 మూవీ కారణంగా ఇంటర్ స్టెల్లార్ సినిమాకు థియేటర్లు దొరకడం లేదన్న విమర్శలపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. ‘ఇది మన సినిమా. వేరే చిత్రాల కోసం దీన్ని తక్కువ చేయవద్దు. పక్క సినిమాలపై మోజుతో మన దేశ సినిమాలను చిన్న చూపు చూస్తామా? పక్క దేశాలు మన సినిమాలను ప్రశంసిస్తుంటే మనం ఏం చేస్తున్నాం. ఇది బాధాకరం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో జాన్వీని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

AP: ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 1,67,299 మంది రైతుల నుంచి 11.63 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 40,811 టన్నుల ధాన్యాన్ని కొని రైతుల ఖాతాల్లో రూ.94 కోట్లు జమ చేశామన్నారు. ప్రస్తుతం రైతులు సమీపంలోని ఏ మిల్లుకైనా ధాన్యాన్ని తరలించుకునే సౌలభ్యం కల్పించామని తెలిపారు. 48 గంటల్లోనే వారికి డబ్బులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.