News April 3, 2024

విచిత్రం.. తలపై కొమ్ముతో ‘జంతు మనిషి’

image

MP భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి జంతువులాగా తలపై కొమ్ము పెరుగుతోంది. దీంతో ఆయన్ను ‘జంతు మనిషి’ అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాగర్ జిల్లాలోని రహ్లి గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్‌‌ తలకు 2014లో గాయమైంది. కొన్ని రోజులకు తలపై వింతగా చర్మం పెరగడాన్ని గమనించి కత్తిరిస్తూ వస్తున్నాడు. మరింత వేగంగా పెరగడంతో వైద్యులను సంప్రదించగా.. ఇది అరుదైన చర్మవ్యాధని, క్యాన్సర్‌‌కు సంకేతమని తెలిపారు.

News April 3, 2024

పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విభాగాల పెన్షన్ దారులు సచివాలయాలకు రానవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లను కోరింది. ఎండల దృష్ట్యా ఉ.7 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించింది.

News April 3, 2024

IPLలో ఎక్కువ సార్లు 200+ స్కోర్ చేసిన జట్లు ఇవే..

image

29 సార్లు- చెన్నై
24 సార్లు- ఆర్సీబీ
23 సార్లు- ముంబై
21 సార్లు- కేకేఆర్
21 సార్లు- పంజాబ్

News April 3, 2024

IPL కాదు GIPL

image

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.

News April 3, 2024

రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం?

image

TG: కార్పొరేట్ కాలేజీలపై కొరడా ఝళిపించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను నియంత్రించేందుకు కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం అసెంబ్లీలో చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఫీజుల నియంత్రణకు కసరత్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

News April 3, 2024

‘బంతి పరిస్థితి ఇది’

image

విశాఖలో కేకేఆర్ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌పై నెటిజన్లు ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. సునామీ లాంటి కోల్‌కతా ఇన్నింగ్స్‌కి బాల్ గాయపడి ఉంటుంది అంటూ బంతికి బ్యాండేజ్ వేసిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ‘ఇన్నింగ్స్ ముగిసింది. ఇప్పుడు వెళ్లి శ్వాస తీసుకోండి’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు 22 ఫోర్లు, 18 సిక్సులు బాదారు.

News April 3, 2024

పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్

image

హీరోయిన్ అంజలి తన పెళ్లి వార్తలపై స్పందించారు. తాను నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు మళ్లీ ఐదోసారి చేస్తున్నారు. నేను వివాహం చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు వార్తలు రాశారు. ఈ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. పెళ్లి చేసుకుంటా.. కానీ కొంత సమయం పడుతుంది’ అని ఆమె చెప్పారు.

News April 3, 2024

ఐపీఎలే ముద్దు

image

విదేశీ ప్లేయర్లు తమ జాతీయ జట్లకు ఆడటం కంటే ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ ఆడుతున్న 8 మంది న్యూజిలాండ్ క్రికెటర్లు పాక్‌తో T20 సిరీస్ ఆడేందుకు నో చెప్పారు. దీంతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కివీస్ జట్టును ఎంపిక చేసింది. విలియమ్సన్, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్, సాంట్నర్, ఫిలిప్స్ వంటి ప్లేయర్లు IPL ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 3, 2024

మథుర కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌

image

UPలోని మథుర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌ పోటీ చేయనున్నారు. ఈ సీటును తొలుత బాక్సర్ విజేందర్ సింగ్‌కు కేటాయించగా, ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటును ముకేశ్‌తో భర్తీ చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి నటి హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మథురతో పాటు సీతాపూర్ అభ్యర్థిని కూడా హస్తం పార్టీ మార్చింది. ఇక్కడ నకుల్ దూబే స్థానంలో రాకేశ్ రాథోడ్ పోటీకి దిగనున్నారు.

News April 3, 2024

IPL చరిత్రలో అత్యధిక స్కోర్లు

image

277/3- SRH vs MI (2024)
272/7- KKR vs DC (2024*)
263/5- RCB vs PWI (2013)
257/5- LSG vs PBKS (2023)
248/3- RCB vs GL (2016)
246/5- CSK vs RR (2010)
246/5- MI vs SRH (2024)