India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NEET పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పట్నాలో నీట్ అవకతవకలపై విచారణ జరుగుతోందని, బిహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.
కేంద్ర విద్యాశాఖ తాజాగా UGC NET-2024 (National Eligibility Test)ను రద్దు చేసింది. అయితే NEET, NET పేర్లు దాదాపు ఒకే రకంగా ఉండటంతో చాలా మంది NEET రద్దు చేశారని అయోమయపడుతున్నారు. కేంద్రం రద్దు చేసింది NETని మాత్రమే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం NET నిర్వహిస్తే.. BDS, MBBS కోర్సుల్లో అడ్మిషన్లకు NEET (National Eligibility-cum-Entrance Test) నిర్వహిస్తారు.
>>SHARE IT
AP: జగన్ తప్పిదాలు, చేతగానితనంతో పోలవరం ప్రాజెక్టు గాడి తప్పిందని టీడీపీ విమర్శించింది. ‘ఒక అసమర్థుడి మూర్ఖత్వానికి పోలవరం బలైంది. అధికారం ఇచ్చారని రాష్ట్రాన్నే గోదావరిలో ముంచేశారు. మొత్తం సరి చేసి, పోలవరాన్ని మళ్లీ గాడిలో పెడుతుంది ప్రజా ప్రభుత్వం’ అని ట్వీట్ చేసింది. 2019 మే నాటికి, 2024 మే నాటికి ప్రాజెక్టులో ఎంత శాతం పనులు పూర్తయ్యాయనే దానిపై ఓ పట్టికను పోస్ట్ చేసింది.
నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది. పేపర్ లీకైందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై CBI విచారణకు ఆదేశించింది. మరోసారి NET నిర్వహిస్తామని ప్రకటించింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి దీనిని నిర్వహిస్తారు. మరోవైపు NEETలో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయమని స్టార్ హీరోయిన్ నయనతార అన్నారు. ‘‘గజిని’ సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా సూర్య, అసిన్ జంటగా తెరకెక్కిన ‘గజిని’ మూవీ 2005లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషించారు.
తమ రెండు దేశాల్లో దేనిపై దాడి చేసినా ఊరుకోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న పుతిన్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భద్రత, అంతర్జాతీయ సమస్యలు, ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. కాగా 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడం విశేషం.
అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు RRB ప్రకటించింది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సైట్ చూడండి.
టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్‌ను దుబాయ్ పోలీసులు వినియోగిస్తున్నారు. ‘టెస్లాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు సైబర్ ట్రక్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో యాడ్ అయింది’ అని దుబాయ్ పోలీస్ కమాండ్ ట్వీట్ చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు అందించే సెక్యూరిటీలో ఈ సైబర్ ట్రక్‌ను ఉంచారు. ఆ దేశ పోలీసులు హై-ఎండ్ కార్లను వినియోగిస్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. రోజువారీ కూలీలు కరుణాపురంలో నాటుసారా కొనుగోలు చేసి తాగడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దృష్టి లోపం, విరేచనాలు లాంటి లక్షణాలు బయటపడ్డాయి.
Sorry, no posts matched your criteria.