News April 3, 2024

అరే ఏంట్రా ఇది.. ఉబర్ ఆటో బుక్ చేస్తే రూ.3 కోట్ల బిల్!

image

ఉబర్ ఆటో బుకింగ్స్‌లో నెలకొన్న సాంకేతిక లోపం వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే నోయిడాలో ఓ వ్యక్తికి రూ.7 కోట్లు, బెంగళూరులో రూ.1 కోటి బిల్ వచ్చిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. తాజాగా పుణేకు చెందిన దీపాంత్ ప్రశాంత్ అనే వ్యక్తి ఆటో రైడ్ పూర్తయిన తర్వాత రూ.3కోట్ల బిల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది సాంకేతిక లోపమైనప్పటికీ, బిల్లు భారం వారిపై పడుతుందేమోనని డ్రైవర్లు కంగారు పడుతున్నారని ఆయన తెలిపారు.

News April 3, 2024

కేజ్రీవాల్ బరువు తగ్గలేదు: జైలు అధికారులు

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై తిహార్ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఏప్రిల్ 1న జైలుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన బరువు 65kgs వద్ద స్థిరంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారని, ఆయన శరీర అవయవాల పనితీరు నార్మల్‌గానే ఉందని చెప్పారు. మరోవైపు ఆయన 4.5kgs తగ్గారని ఆప్ నేతలు చెబుతున్నారు.

News April 3, 2024

‘టిల్లు స్క్వేర్’ సినిమా చూసిన ఎన్టీఆర్!

image

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించారు. గత రాత్రి నిర్మాత నాగవంశీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ చూశారు. సినిమాను ఎన్టీఆర్ ఎంజాయ్ చేశారని సమాచారం. స్క్రీనింగ్ తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. కాగా, ఈనెల 8న జరిగే ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్‌కి NTR గెస్ట్‌గా రానున్నారు.

News April 3, 2024

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే వేదికపై 100 టీ20 మ్యాచులు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో మ్యాచులో కింగ్ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(వాంఖడే-80 మ్యాచులు), ధోనీ(చెపాక్-69 మ్యాచులు) ఉన్నారు.

News April 3, 2024

లోక్‌సభ పోటీ నుంచి తప్పుకున్న తెలుగు నటి

image

ప్రముఖ నటి సుమలత పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య స్థానం నుంచి పోటీ చేయట్లేదని, తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆమె.. కర్ణాటకలో తొలి స్వతంత్ర మహిళా MPగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హెచ్ డీ కుమార స్వామి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు.

News April 3, 2024

ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? – 1/2

image

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కుటుంబం, స్టార్లకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. డబుగామ్ అసెంబ్లీ సీటు నుంచి మాజీ MLA భుబ్‌బల్ కుమార్తె లిపికా బరిలో నిలవనున్నారు. ఇక భుజ్‌బల్ నాబరంగపుర్ నుంచి MPగా పోటీ చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్, ఆయన కుమారుడు సాగర్.. నార్ల, భవానీపట్న అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? – 2/2

image

బాలంగిర్‌ అసెంబ్లీ సీటులో నటుడు మనోజ్ మిశ్రాను బరిలో నిలిపింది. తల్సరాలో భారత్ హాకీ మాజీ కెప్టెన్ ప్రబోధ్ తిర్కేను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చికిటి అసెంబ్లీ సీటులో అన్నదమ్ములు తలపడనున్నారు. అన్న రవీంద్రనారాయణ్ దయాన్‌ను కాంగ్రెస్ బరిలో నిలపగా, BJP అతని తమ్ముడు మనోరంజన్‌కు టికెట్ ఇచ్చింది. ఈ ‘ఫ్యామిలీ’, ‘స్టార్ల’ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

AA BIRTHDAY: ‘ఆర్య-2’ రీరిలీజ్ వాయిదా!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా థియేటర్లలో రచ్చ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ముందుగా అనుకున్నట్లు ఈనెల 8న ‘ఆర్య-2’ రీరిలీజ్ చేయట్లేదని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, జులాయి స్పెషల్ షోల స్క్రీనింగ్ కూడా వాయిదా పడింది. ఆయన బర్త్ డే రోజున ‘పుష్ప-2’ టీజర్ విడుదల కానుంది.

News April 3, 2024

నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా: బీజేపీ ఎంపీ

image

తాను గత 6 నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నానని బిహార్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకు ఇదే సరైన సమయమని భావించానని, లోక్‌సభ ఎన్నికల్లో తాను పాల్గొనలేనని ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని పీఎం మోదీకి తెలియజేశానన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

News April 3, 2024

అవినాశ్‌కు సిగ్గుంటే పోటీ నుంచి తప్పుకోవాలి: బీటెక్ రవి

image

AP: YS వివేకా హత్య కుట్ర గురించి షర్మిల కుండబద్దలు కొట్టినట్లు <<12975358>>చెప్పారని<<>> టీడీపీ నేత బీటెక్ రవి వెల్లడించారు. ‘కడప ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని షర్మిల చెప్పారు. ఆమె పోటీకి ఒప్పుకున్నారని వివేకా జగన్‌కు చెప్పారు. ఆ తర్వాతే హత్యకు కుట్ర జరిగింది. అవినాశ్ రెడ్డికి సిగ్గుంటే ఎంపీగా పోటీ నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని జగన్ పోటీకి పెట్టారు’ అని ఆరోపించారు.