News June 19, 2024

నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్

image

TG: దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని చెప్పారు. జులై 2వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మందే ప్రవేశాలు పొందారు.

News June 19, 2024

కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై!

image

టీ20 WCలో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నారు. కేన్ ఇప్పటికే టెస్టు కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీ20 WCలో లీగ్ దశలోనే న్యూజిలాండ్ వెనుదిరగడం గమనార్హం.

News June 19, 2024

లిఫ్ట్‌లో అంతరిక్షానికి.. జపాన్ కంపెనీ ప్లాన్!

image

ఆకాశానికి నిచ్చెన వేయడం అనే అతిశయోక్తిని మనం వింటూంటాం. జపాన్‌కు చెందిన ఒబయాషీ కార్పొరేషన్ సంస్థ నిజంగానే ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. మనుషుల్ని రోదసికి లిఫ్ట్‌లో పంపించేలా ప్లాన్ చేస్తోంది. భూమి నుంచి శాటిలైట్ వరకు కేబుల్ వేసి దాని ద్వారా 96వేల కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహం వద్దకు చేర్చేలా ప్లాన్ వేసింది. 2050కల్లా దీన్ని సాధ్యం చేయాలని భావిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 100 బిలియన్ డాలర్లు!

News June 19, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

News June 19, 2024

ఇంటర్ సప్లిమెంటరీలో 59శాతం ఉత్తీర్ణత

image

AP: ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 59% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,27,190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 42,200 మంది బాలురు, 32,668 మంది బాలికలున్నారు. ఉత్తీర్ణతలో 84%తో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానంలో ఉండగా, 41 శాతంలో ప.గో చివరి స్థానంలో ఉంది. కాగా ఈ నెల 26న ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను వెల్లడిస్తారు.

News June 19, 2024

వయనాడ్‌లో గెలిస్తే ప్రియాంక అరుదైన రికార్డు

image

రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఆమె గెలిస్తే తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అంతేకాక గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి గెలిచిన మూడో వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. దీంతో పాటు పార్లమెంటులో తొలిసారిగా సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి సభ్యులుగా ఉండనున్నారు.

News June 19, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంతో చర్చిస్తాం: శ్రీనివాసవర్మ

image

AP: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా స్టీల్‌ప్లాంట్‌పై ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ‘నాన్‌స్ట్రాటజిక్ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ తెరపైకొచ్చింది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడను. దీనిపై CBN, పవన్‌తో కలిసి PMతో చర్చిస్తాం’ అని తెలిపారు.

News June 19, 2024

ఇవాళ్టి నుంచి ‘పవర్’ కళ్యాణ్

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉ.9.30 క్యాంప్ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపడతారు. ఉ.11.30కి IAS, IPS అధికారులతో, మ.12 గంటలకు గ్రూప్-1,2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి అవుతున్న పవన్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

News June 19, 2024

ఈవీఎంలు పోవాల్సిందే.. బ్యాలెట్ రావాల్సిందే: డీకే శివకుమార్

image

ఈవీఎంల పనితీరుపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో BJP- JDS కూటమి అత్యధిక సీట్లు గెలవడానికి EVMలే కారణమని ఆరోపించారు. EVMలను తీసేసి.. మళ్లీ పోస్టల్ బ్యాలెట్ విధానం తేవాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు గాను BJP 29 చోట్ల గెలవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు. కాగా కర్ణాటకలో బీజేపీ 17, జేడీఎస్ 2, కాంగ్రెస్ 11 చోట్ల నెగ్గాయి.

News June 19, 2024

24 నుంచి పార్లమెంటు సమావేశాలు

image

ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.0కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం.