India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫోన్ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంది. అతడిని ఐసోలేషన్లో ఉంచామని, వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పరీక్షలకు పంపామంది. కాగా ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయ్లాండ్ దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 926మంది మరణించారు.
బిహార్లో ఓ డాక్టర్ యూట్యూబ్ చూస్తూ సర్జరీ చేయడంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. అనారోగ్యంగా ఉన్న ఓ బాలుడిని(15) అతడి కుటుంబీకులు సరన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అజిత్ అనే వైద్యుడు వారి అనుమతి లేకుండానే బాలుడికి పిత్తాశయ సర్జరీని యూట్యూబ్లో చూస్తూ చేశాడు. అనంతరం బాలుడు చనిపోవడంతో సిబ్బందితో సహా పరారయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతుండటంతో గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడితో మాట్లాడిన ఆయన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని, అయితే అది కష్టంతో కూడుకున్నది ఆయన వివరించారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్గిరి, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TG: హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. కొనేముందు ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్లు పరిశీలన చేయండి’ అని సూచించారు. ప్రస్తుతం FTL, బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు.
శ్వాస తీసుకోవడం మాదిరిగానే అపానవాయువు విడుదల కూడా మనిషికి సహజం. అయితే చాలామంది పలు కారణాల రీత్యా అపానవాయువును ఆపుకొంటుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఫర్వాలేదు కానీ ఇదో అలవాటుగా మారితే అనారోగ్యకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు ఆపుకొన్న గ్యాస్ తిరిగి పొట్టలోకి వెళ్తుంది. కొంతమేర శరీరం తిరిగి పీల్చుకుంటుంది. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి’ అని వివరించారు.
TG: ‘హైడ్రా’ కూల్చివేసిన భవనం తనది కాదని ఏపీలోని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తనకు హైదరాబాద్లో భవనాలే లేవన్నారు. కొందరు టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానే హైడ్రాకు నోటీసులు పంపిస్తానని కాటసాని వెల్లడించారు. కాగా అమీన్పూర్ పెద్దచెరువు FTLలో కాటసాని అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.
పారిస్ పారాలింపిక్స్లో భారత్ 29 పతకాలతో సత్తా చాటింది. టోక్యో కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఈ సారి 7 బంగారు, 9 వెండి, 13 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే 4 ఎక్కువగా సాధించి భారత పారా అథ్లెట్లు అద్భుతం చేశారు. దీంతో దేశం గర్వించేలా చేసిన వీరికి ఘనంగా స్వాగతం పలకాలని పలువురు కోరుతున్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరంలో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు కుండపోత వర్షాలు కురుస్తున్న విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.