News April 2, 2024

ఈ వారంలోనే ఫలితాలు విడుదల

image

AP:గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ శనివారంలోగా విడుదలయ్యే ఛాన్సుంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో APPSC నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్సుంది. నోటిఫికేషన్ జారీ, ప్రిలిమ్స్ మధ్య సన్నద్ధతకు సమయం లేకపోవడంతో ఒక్కో పోస్టుకు 100 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

News April 2, 2024

‘ఇక చాలు పాండ్య.. రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చెయ్’

image

ఈ IPL సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. దీంతో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్‌గా వ్యూహాలను అమలు చేయడంతో హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ‘ఇక చాలు హార్దిక్.. రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేకుంటే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేమని అభిప్రాయపడుతున్నారు.

News April 2, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

AP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సెట్-2024, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు 5 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

News April 2, 2024

GOOD NEWS.. త్వరలో అకౌంట్లోకి డబ్బులు

image

TG: రైతుబంధు డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ‘ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందింది. మిగతా వారికి ఈ నెలాఖరులోగా సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. ఒకేసారి రుణమాఫీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నాం. వచ్చే పంట సీజన్ నుంచి వరిధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తాం’ అని వెల్లడించారు.

News April 2, 2024

సొంతగడ్డపై RCBకి మరో పరీక్ష

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు సొంతగడ్డపై మరో పరీక్ష ఎదుర్కోనుంది. IPL2024లో ఇప్పటి వరకు 14 మ్యాచు‌లు జరగ్గా.. 12 మ్యాచుల్లో హోం టీమ్స్ గెలిచాయి. KKR చేతిలో RCB, నిన్న RR చేతిలో ముంబై మాత్రమే ఓడాయి. దీంతో RCBపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. అయితే.. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో RCB మ్యాచ్ ఆడనుంది. LSGపై గెలిచి ఆ ముద్ర చెరిపేసుకుంటుందేమో వేచిచూడాలి.

News April 2, 2024

పెరుగుతున్న ఎండలు.. ప్రభుత్వం అప్రమత్తం

image

TG: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా చర్యలు ముమ్మరం చేస్తోంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేసింది. ఇవి ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.

News April 2, 2024

అస్సాం CSగా తెలుగు వ్యక్తి

image

APలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి(M) కోటపాడుకు చెందిన రవి కోత అస్సాం CSగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1993వ బ్యాచ్ అస్సాం-మేఘాలయ కేడర్‌ IAS అధికారి. అస్సాం CS బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. 1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఆగ్రానమిలో PhD గోల్డ్ మెడల్ అందుకున్నారు.

News April 2, 2024

మద్యం తాగే మహిళలకు షాకింగ్ న్యూస్

image

పురుషులతో సమానంగా మద్యం తాగే మహిళలు ఇటీవల ఎక్కువయ్యారు. అయితే వారు మితంగా ఆల్కహాల్ సేవించినప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50% పెరుగుతుందని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. 18-65 ఏళ్ల వయసున్న 4.32 లక్షల మందిపై సర్వే చేశారు. వారానికి 8 కంటే ఎక్కువసార్లు డ్రింక్స్ తీసుకున్నవారిలో గుండె వ్యాధుల ప్రమాదం 33% నుంచి 51% ఉన్నట్లు వెల్లడైంది. అతిగా మద్యపానం చేసేవారిలో ఈ ప్రమాదం 68% ఉందట.

News April 2, 2024

ఓటు వేసే ముందు నేర చరిత్రను తెలుసుకోండి!

image

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. పోటీలో నిలబడిన అభ్యర్థుల నేర చరిత్ర గురించి తెలుసుకోవడం ఓటరు బాధ్యత అని ఈసీ సూచించింది. KYC యాప్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర పూర్వాపరాల గురించి తెలుసుకోవాలని కోరింది. అభ్యర్థుల అఫిడవిట్‌లను డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవాలని పేర్కొంది.

News April 2, 2024

పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన శివానందరెడ్డి

image

నంద్యాల పార్లమెంట్ TDP ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. భూవివాదం కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు నంద్యాల(D) నందికొట్కూరు(M) అల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. అరెస్ట్ వారెంట్ చూపాలని శివానందరెడ్డి కోరగా పోలీసులు నోటీసులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో పారిపోయారు.