India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అచ్చం ఇండియా మ్యాప్‌లా కనిపిస్తోంది కదూ! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు నడుస్తున్న మార్గం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్‌తో దేశాన్ని ఇది కలుపుతోందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. వందే భారత్ రైలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తోందని ఆయన Xలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
రోజూ చేసే కొన్ని పనులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనే విషయం మీకు తెలుసా? ‘భోజనం తింటూ నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దిండు కింద ఫోన్ పెట్టుకుంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. చాలా వేడిగా ఉన్న ఆహారం తింటే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చెవిలో కాటన్ స్వాబ్స్ పెడితే వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు.
ఆధార్, పాన్, ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేమని బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొన్ని సేవలు పొందేందుకు ఇవి గుర్తింపు కార్డులు మాత్రమేనని, దేశ పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన బాబు అబ్దుల్ రౌఫ్ సర్దార్ అనే వ్యక్తి తాను భారతీయుడినని ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు ప్రూఫ్‌గా చూపించగా, అవి ఆధారాలు కావని అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.
AP: రాష్ట్రంలో ఈ నెల 15న స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ఆ రోజు విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు వేశారు. టిమ్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేశారు. కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు.
TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.
AP: 3 శాఖల్లో 21 ఉద్యోగాలకు APPSC <
ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద హీరోలతో ₹వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి, టికెట్ ధరలు పెంచుకున్నా ₹200 కోట్లు రాబట్టడం గగనమైపోతోంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ₹15కోట్లతో రూపొందించగా ఇప్పటికే ₹225 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. క్వాలిటీ ప్రజెంటేషన్ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని ఇది నిరూపించింది.
హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ జాబితాలో ముకేశ్ అంబానీ కుటుంబం మరోసారి టాప్‌లో నిలిచింది. రూ.28.2 లక్షల కోట్లతో ఈ ఫ్యామిలీ అగ్రస్థానం సాధించింది. రూ.6.5 లక్షల కోట్లతో కుమార్ మంగళం బిర్లా కుటుంబం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో రూ.5.7 లక్షల కోట్లతో జిందాల్ ఫ్యామిలీ, 4వ స్థానంలో రూ.5.6 లక్షల కోట్లతో బజాజ్ ఫ్యామిలీ, ఐదో స్థానంలో రూ.5.4 లక్షల కోట్లతో మహీంద్రా కుటుంబం నిలిచింది.
ఉన్నత చదువుల కోసం US వెళ్లిన HYD అమ్మాయి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీజ(23) చికాగోలో ఉంటూ ఇటీవలే MS పూర్తి చేశారు. నిన్న ఓ రెస్టారెంట్ నుంచి తాను ఉండే అపార్ట్‌మెంట్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు. శ్రీజ చెల్లెలు శ్రేయ కూడా MS చేసేందుకు ఇటీవల US వెళ్లారు. కూతురి మరణంతో ఆమె పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు.
AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 70శాతం పోలింగ్ రికార్డయింది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.