India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శరీరంలోని మాంసాన్ని తింటూ 48గంటల్లోనే మనిషిని చంపగలిగే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా జపాన్‌లో కలకలం రేపుతోంది. ఈనెల 2 నాటికి 977 మందికి సోకగా, ఏడాది చివరికి 2500మందికి వ్యాపించొచ్చని అధికారులు తెలిపారు. మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పరిశుభ్రతతో దీన్ని అడ్డుకోవచ్చు.
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈనెల 19,20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(AISA) పిలుపునిచ్చింది. పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. నీట్ ఫలితాల్లో 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించగా ఇందులో హరియాణాలోని ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీంతో పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిన్న 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా కపుల్స్‌కి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్పెషల్ విషెస్ చెప్పారు. వారికి థాంక్స్ చెబుతూ భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసున్న క్యూట్ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. అందులో చరణ్ దంపతులు క్లీంకారతో బుడిబుడి అడుగులు వేయిస్తున్నట్లు ఉంది.
కన్నబిడ్డలు ప్రయోజకులైతే తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేనిది. తల్లిదండ్రులకు మించి సక్సెస్ సాధిస్తే అంతకుమించిన గర్వకారణం ఉండదు. తాజాగా తెలంగాణకు చెందిన IPS అధికారి వెంకటేశ్వర్లు కూతురు తండ్రిని మించిన తనయగా అందరి దృష్టి ఆకర్షించారు. ట్రైనీ IAS అయిన ఉమాహారతి పోలీస్ అకాడమీకి రాగా అక్కడే డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కూతురికి సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం అందరి మనసును తాకింది.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే తనకు చివరిదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.
ఇండియా, కెనడా మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం ఏర్పడింది. ఫ్లోరిడాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. మ్యాచ్ అంపైర్లు రాత్రి 8 గంటలకు మరోసారి పిచ్‌ను పరిశీలించి టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
TG: ఆరేళ్ల బాలిక <<13437328>>హత్యాచార<<>> ఘటనను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని పెద్దపల్లి కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఇప్పటికే డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు.
యూకే ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కాంప్‌బెల్(54) మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ మాజీ ప్లేయర్ కెవిన్ మరణ వార్త కలిచివేసిందని పేర్కొంది. 1988లో తన కెరీర్‌ను ప్రారంభించిన కెవిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా తన కెరీర్‌లో 148 గోల్స్ చేశారు.
మాజీ పీఎం ఇందిరాగాంధీ దేశానికి అమ్మవంటివారని బీజేపీ ఎంపీ సురేశ్ గోపి పేర్కొన్నారు. కేరళ మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్టు నేత ఈకే నాయనార్లు తన రాజకీయ గురువులని తెలిపారు. బీజేపీకి చెందిన ఆయన కాంగ్రెస్, సీపీఎం నేతల్ని పొగడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాగా.. తన మాటలకు రాజకీయాలను ఆపాదించొద్దంటూ సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆయన కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.