News October 27, 2025

రెండో దశ SIR ఇలా..

image

* రెండో దశ <<18119730>>SIRలో<<>> భాగంగా 12 రాష్ట్రాలు, UTల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేయనున్నారు.
*5.33 లక్షల BLOలు, 7 లక్షల BLAలు పాల్గొంటారు. వీరికి ట్రైనింగ్ వెంటనే మొదలవుతుంది.
*నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ఎన్యుమరేషన్ జరుగుతుంది. BLOలు ప్రతి ఇంటిని 3సార్లు విజిట్ చేస్తారు.
*డిసెంబర్ 8న డ్రాఫ్ట్ జాబితాలు ప్రచురిస్తారు. 2026 జనవరి 8 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురిస్తారు.

News October 27, 2025

ICU నుంచి బయటకు వచ్చిన అయ్యర్

image

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని Cricbuzz తెలిపింది. ఆయన కోలుకుంటున్నారని, ICU నుంచి బయటకు వచ్చారని పేర్కొంది. బీసీసీఐ టీమ్ డాక్టర్‌ను కేటాయించిందని, అయ్యర్ ఆరోగ్యాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. కాగా ఈ నెల 25న సిడ్నీలో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ గాయపడ్డారు. అతడి ఎడమవైపు <<18117184>>పక్కటెముకల<<>> వద్ద ఉండే Spleen(ప్లీహం) అవయవానికి గాయమైంది.

News October 27, 2025

అత్యుత్తమ వివాహ రకమిదే..

image

వివాహాలన్నింటిలో బ్రాహ్మమును ధర్మబద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో వధువు తండ్రి తగిన అర్హతలు గల వరుడిని స్వయంగా అన్వేషించి, ఆహ్వానిస్తారు. తన కుమార్తెను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దానం చేస్తారు. ఇది ధర్మ సంయోగానికి ప్రతీక. ఈ దానం ద్వారా వధువు తండ్రి పుణ్యాన్ని పొందుతాడు. వధూవరులు ధార్మిక జీవితాన్ని ప్రారంభించి, సుఖసంతోషాలతో, ఉత్తమ గతులు పొందుతారు. ఇది దైవిక ఆశీస్సులతో కూడిన వివాహ బంధం. <<-se>>#Pendli<<>>

News October 27, 2025

కాకినాడకు 490KMల దూరంలో తుఫాన్

image

AP: మొంథా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 440KM, విశాఖకు 530KM, కాకినాడకు 490 KMల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో 17KMPHతో కదిలిందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం 4PM నుంచి 11PM మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. ఆ సమయంలో భారీ గాలులు, వర్షాలు కురుస్తాయని వివరించారు.

News October 27, 2025

రేపు విజయవాడలో భారీ వర్షాలు.. బయటకు రావొద్దని వార్నింగ్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454

News October 27, 2025

వాహనదారులూ.. ఇది తప్పక తెలుసుకోండి!

image

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్‌పై రాసి ఉన్న కోడ్‌లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది. L ఉంటే 120kmph, N- 140kmph, P- 150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V- 240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్‌ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. SHARE IT

News October 27, 2025

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

News October 27, 2025

గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

image

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.

News October 27, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 27, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, డిగ్రీ, ఎండీ(రేడియాలజీ), ఎంబీబీఎస్, డీఎన్‌బీ, బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా(నర్సింగ్), ఇంటర్, DMLT, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.nia.nic.in/