India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్టికల్-370 అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటనలో స్పష్టం చేశారు. దాన్ని తిరిగి తీసుకురావడం జరగదని తేల్చిచెప్పారు. 370వ అధికరణను తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడంతో షా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా.. జమ్మూకశ్మీర్‌లో 2014 తర్వాత తొలిసారిగా ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెల్లడవుతాయి.
TG: డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు కీ కోసం ఇక్కడ <
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ‘మా కుటుంబంలోకి కొత్త తారకు స్వాగతం’ అంటూ ఆయన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నితిన్ 2020 జులైలో షాలినిని వివాహమాడారు. అటు ‘తమ్ముడు’ టైటిల్‌లో ఆయన ఓ సినిమా చేస్తున్నారు.
TG: 2 రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ను CM రేవంత్ కోరారు. ‘వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ పంట నష్టం వాటిల్లింది. వరద నష్టం రూ.5,438 కోట్లుగా అంచనా వేశాం. తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ కోసం నిధులు ఇవ్వండి. APకి ఎలా సాయం అందిస్తారో మాకూ అలాగే చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. ఇందుకు సంబంధించి వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ నుంచి ఆయన జెర్సీ అందుకున్నారు. కాగా 2012, 13 సీజన్లలో ద్రవిడ్ ఆర్ఆర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014, 15 సీజన్లలో ఆ జట్టు మెంటార్‌గా సేవలందించారు.
T.PCC చీఫ్ ఎంపిక విషయంలో మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ పేర్లను సోనియా గాంధీకి పంపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికి పగ్గాలు అప్పగించాలన్న దానిపై రాష్ట్ర, AICC నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో నిర్ణయాన్ని సోనియాకు వదిలేశారు. మహేశ్ NSUI నుంచి క్రియాశీలకంగా ఉండడంతో కింది స్థాయి నేతల్ని కలుపుకొనిపోగలరన్న నమ్మకంతో సోనియా ఆయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
గేమ్‌ఛేంజర్ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ రెండు రోజులుగా నెట్టింట SVC ప్రొడక్షన్ హౌస్‌ను తిడుతూ చేస్తున్న నెగటివ్ ట్రెండ్‌పై ఆ మూవీ సంగీత దర్శకుడు తమన్ ట్విటర్‌లో స్పందించారు. ‘మీరు సినిమా అప్‌డేట్ కోసం చాలాకాలంగా చూస్తున్నారని తెలుసు. కానీ మాకు మీ మద్దతు కావాలి. సినిమాలు, సమాజం కోసం చాలా చేసినవారిని బాధించేలా హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ చేయొద్దు. ఇది నా విజ్ఞప్తి. లవ్ యూ ఆల్’ అని పోస్ట్ చేశారు.
TG: TPCC చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను AICC నియమించింది. ఎంతో మంది BC నేతలు ఈ పదవి కోసం పోటీపడినా ఆయనకే దక్కింది. ముఖ్యంగా BC సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ ఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ చేసినా ఆయనను పట్టించుకోలేదు. వ్యతిరేకత లేకపోవడం, గత ఎన్నికల్లో సీటు త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించడం, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఆయనకు కలిసి వచ్చింది.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి రూ.3,300కోట్ల నిధులు విడుదల చేసింది. తక్షణ సహాయ చర్యల కోసం ఈ నిధులు కేటాయించాలని చెప్పింది. వరదల వల్ల ఏర్పడ్డ నష్టాల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయన AP CM చంద్రబాబు, TG CM రేవంత్‌ను కలిశారు.
NSUIలో క్రియాశీలకంగా పనిచేసిన మహేశ్ కుమార్ గౌడ్‌కి కాంగ్రెస్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1966 Febలో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహమత్ నగర్‌లో ఆయన జన్మించారు. NSUI జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారిగా 1994లో డిచ్‌పల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2013-14 మధ్య ఏపీ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా చేశారు. 2018, 2023 ఎన్నికల్లో పోటీచేయలేదు. 2024లో MLA కోటాలో MLCగా ఎన్నికయ్యారు.
Sorry, no posts matched your criteria.