News September 6, 2024

మోక్షజ్ఞకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

image

సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన బావ, మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. 100 శాతం కష్టపడాలని మోక్షజ్ఞకు మంత్రి సూచించారు. అలాగే కళ్యాణ్‌రామ్, మంచు లక్ష్మీ, నారా రోహిత్ తదితరులు ఆయనకు విషెస్ తెలిపారు.

News September 6, 2024

భారత్‌కు మరో గోల్డ్

image

పారిస్ పారాలింపిక్స్‌లో ఇండియా ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్‌ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 26 మెడల్స్ చేరాయి. వీటిలో 6 గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

News September 6, 2024

టాప్-10 పెయిడ్ ఆటగాళ్లు వీరే.. కోహ్లీది ఎన్నో స్థానం అంటే?

image

వరల్డ్‌లోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (రూ.2,081 కోట్లు) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత జాన్ రామ్-రూ.1,712 కోట్లు, మెస్సీ-రూ.1,074 కోట్లు, లెబ్రాన్ జేమ్స్-రూ.990 కోట్లు, ఎంబాపే-రూ.881 కోట్లు, గియాన్నిస్-రూ.873 కోట్లు, నెయ్‌మార్-రూ.864 కోట్లు, బెంజిమా-రూ.864 కోట్లు, విరాట్ కోహ్లీ-రూ.847 కోట్లు, స్టీఫెన్ కర్రీ-రూ.831 కోట్లు గడించారు.

News September 6, 2024

తెలుగు రాష్ట్రాలకు సురేశ్ ప్రొడక్షన్స్ రూ. కోటి సాయం

image

వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల సహాయార్థం సురేశ్ ప్రొడక్షన్స్ తరఫున రూ. కోటి విరాళమిస్తున్నట్లు నటుడు వెంకటేశ్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వరద బాధితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. అందరం కలిసి రాష్ట్రాల్ని పునర్నిర్మించుకుని బలంగా నిలబడదాం’ అని పేర్కొన్నారు. తన పేరుతో పాటు రానా దగ్గుబాటి పేరు ఉన్న ఓ ప్రకటనను తన పోస్టుకు జత చేశారు.

News September 6, 2024

తెలంగాణ PCC చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్

image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. TPCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రెండు వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు CM రేవంత్ రెడ్డి వద్ద ఉన్న టీపీసీసీ బాధ్యతలు మహేశ్ కుమార్ అందుకోనున్నారు.

News September 6, 2024

సెన్సెక్స్ 1,000, నిఫ్టీ 300 పాయింట్లు డౌన్

image

ఫెడ్ భావి నిర్ణయాలను ప్రభావితం చేసే అమెరికా ఉద్యోగ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్ట‌ర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు కోల్పోయి 81,183 వద్ద‌, నిఫ్టీ 292 పాయింట్ల న‌ష్టంతో 24,852 వ‌ద్ద నిలిచాయి. FIIలు తమ అసెట్ మేనేజ్‌మెంట్ వివరాలు వెల్లడించాలన్న సెబీ డెడ్‌లైన్ కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని తెలుస్తోంది.

News September 6, 2024

వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్: కేంద్రం

image

ఏపీ, తెలంగాణలో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. TGలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 ఎయిర్‌పోర్స్ హెలికాప్టర్లు, ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఎయిర్‌ఫోర్స్, 2 నేవీ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ విజయవాడలోని బుడమేరు వాగు గండ్లు పూడుస్తోంది.

News September 6, 2024

ALERT: కాసేపట్లో వర్షం

image

రాత్రి 7 గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే.. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి.

News September 6, 2024

గుండెనొప్పి వచ్చినవారిపై ఈ పనులు చేయొద్దు

image

ఎవరైనా గుండెనొప్పితో కుప్పకూలినప్పుడు ఏం చేయాలో పాలుపోదు. అలాంటి సమయంలో వారిని రక్షించాలన్న టెన్షన్లో కొంతమంది పలు రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటివేమీ చేయకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. ‘బాధితుడిని ఊపడం, కదల్చడం వంటివి చేయకూడదు. ముఖంమీద కొట్టి లేదా మెడను కదిపి లేపేందుకు యత్నించొద్దు. సరైన సీపీఆర్ ఒకటే గుండె ఆగినవారికి అవసరం’ అని వివరించింది.

News September 6, 2024

హైదరాబాద్ వాసులకు టీటీడీ గుడ్ న్యూస్

image

TG: హైదరాబాద్‌లో నివసించే శ్రీవారి భక్తులకు TTD శుభవార్త చెప్పింది. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయంలో ఇకపై ప్రతిరోజూ లడ్డూలు అందించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో లడ్డూను రూ.50కే విక్రయించనున్నట్లు పేర్కొంది. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD తెలిపింది. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు.