News March 30, 2024

సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు చిన్నారుల మృతి

image

యూపీలో విషాదం చోటు చేసుకుంది. దేవరియా(D) డుమ్రిలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు చిన్నారులు మరణించారు. చాయ్ పెడుతున్న సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 30, 2024

‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. స్టార్ బాయ్ సిద్ధూ రికార్డులు బద్దలు కొడుతున్నాడని పేర్కొంది. కాగా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది.

News March 30, 2024

‘ఈ సారి SRH కప్పు కొడుతుంది మావా..’

image

IPL: ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబైపై భారీ స్కోర్ సాధించిందని గుర్తు చేస్తున్నారు. వరల్డ్ కప్ హీరోలు కమిన్స్, హెడ్‌తో పాటు ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్ క్లాసెన్ జట్టులో ఉన్నారని చెబుతున్నారు. దేశీయ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రాణిస్తున్నారని.. బౌలింగ్ కాస్త మెరుగు పడితే తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.

News March 30, 2024

పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు!

image

స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్‌కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్‌టీవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి.

News March 30, 2024

ఆ ఫొటోలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దు.. పఠాన్‌కి EC ఆదేశం

image

ప.బెంగాల్‌లోని బెర్హంపూర్ TMC MP అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కి ఈసీ షాకిచ్చింది. 2011 WC ఫొటోలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దని తెలిపింది. ఆ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించింది. సచిన్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అతనిపై ఫిర్యాదు చేయగా, EC చర్యలు తీసుకుంది. కాగా తానూ WCలో ఆడినందున ఆ చిత్రాలను వాడుకునే హక్కు తనకు ఉందని యూసుఫ్ అంటున్నారు.

News March 30, 2024

నితిన్ ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

image

టాలీవుడ్ హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

News March 30, 2024

ఈ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్‌ కష్టం: అయ్యర్

image

RCBపై గెలుపు తర్వాత KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌండరీలు కొట్టడం చాలా కష్టమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. RCB ఓటమికి ఇదే కారణమని, ఒకవేళ ఛేజింగ్‌ అయితే పక్కా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు?

News March 30, 2024

బరాత్‌లో డాన్స్ చేయొద్దన్నందుకు భర్త ఆత్మహత్య

image

వివాహ వేడుకలో భార్య డాన్స్ చేయొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) చిన్నఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో కూలీ పని చేసే అనిల్ దంపతులు స్వగ్రామం చిన్నఆరేపల్లిలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్‌లో డాన్స్ వెయ్యొద్దని భార్య చెప్పడంతో ఆవేశంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 30, 2024

అనంతపురం జిల్లా సిద్ధమా..?: CM జగన్

image

AP: సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. తాజాగా ‘అనంతపురం జిల్లా సిద్ధమా..?’ అంటూ జగన్ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నిన్న కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, వేముగోడు, ఆదోని మీదుగా 108 కి.మీ. యాత్ర చేపట్టారు. నేడు పత్తికొండ, గుంతకల్, శింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

News March 30, 2024

ఆర్ఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేయొద్దు: వైద్యారోగ్యశాఖ

image

TG: RMPలు అర్హత లేకుండా వైద్యం చేయొద్దని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2010 ప్రకారం పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. రోగ నిర్ధారణ చేసి మందులివ్వడం, ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, అబార్షన్లు, కాన్పులు చేయడం, ప్రిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూడదని తెలిపింది. సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలని సూచించింది.