News September 5, 2024

BJPలో చేరిన రవీంద్ర జడేజా

image

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా BJPలో చేరారు. ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయాన్ని జడేజా సతీమణి రివాబా జడేజా వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడేజా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఆల్‌రౌండర్ ఇటీవల టీ20I క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా పార్టీలో చేరడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారనే చర్చ మొదలైంది. రివాబా ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి BJP MLAగా ఉన్నారు.

News September 5, 2024

గర్భిణి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

image

యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడిందనే వార్తలు తరచూ వింటున్నాం. 2022లో ఓ గర్భిణిని అలర్ట్ చేసి తల్లీశిశువును కాపాడిన విషయం తాజాగా బయటకొచ్చింది. తాను 33వారాల గర్భంతో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని యాపిల్ వాచ్ గుర్తించిందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్(USA) రేచెల్ మనాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డాక్టర్‌ను కలవాలని సూచించడంతో తాను లాస్ ఏంజెలిస్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు.

News September 5, 2024

సహాయక చర్యలపై పోస్టు.. స్పందించిన AP పోలీస్

image

AP: విజయవాడలో నీట మునిగిన కాలనీలను క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్లు బాధితుల పేరు, కులం అడుగుతున్నారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర పోలీస్ విభాగం ‘విపత్కర సమయంలో తప్పుడు వార్తల ప్రచారం తీవ్రమైన నేరం. కులాలు, ప్రాంతాల మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నించడం క్షమించరానిది. ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుకార్లు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.

News September 5, 2024

ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. కాలి కండరాల గాయంతో ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. అలాగే వన్డే సిరీస్‌లో కూడా ఆయన ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆయన స్థానంలో ఫిల్ సాల్ట్‌ను కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ ఎంపిక చేసింది. బట్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 11 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది.

News September 5, 2024

రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

AP: ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News September 5, 2024

హిందువులపై దాడి అంశాన్ని అతి చేశారు: బంగ్లా చీఫ్ అడ్వైజర్

image

హిందువులపై దాడులు రాజకీయమైనవే తప్ప మతపరమైనవి కావని బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ అన్నారు. వాటిని అతిచేసి చూపించారని PTI ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మోదీకీ ఇదే చెప్పాను. ఈ దాడులకు అనేక కోణాలు ఉన్నాయి. దుర్మార్గపు అవామీ లీగ్, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోగానే ఆ కార్యకర్తలపై దాడులు జరిగాయి. హిందువులూ వారి పక్షం కాబట్టే దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికీ, అవామీ కార్యకర్తలకు తేడా లేదు’ అని అన్నారు.

News September 5, 2024

రష్యా-ఉక్రెయిన్ మధ్య 3 దేశాలు మధ్యవర్తిత్వం చేయొచ్చు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్, చైనా, బ్రెజిల్ కలిసి మధ్యవర్తిత్వం చేయొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ‘మా రెండు దేశాలు ఇస్తాంబుల్‌ చర్చల్లో ప్రాథమిక అంగీకారానికి వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ అంగీకారాన్ని ఆధారంగా చేసుకుని చర్చల్ని కొనసాగించవచ్చు’ అని ఆయన వివరించారు. BRICS కూటమి వ్యవస్థాపక సభ్యదేశాలుగా రష్యాతో పాటు భారత్, చైనా, బ్రెజిల్‌ ఉన్న సంగతి తెలిసిందే.

News September 5, 2024

వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే

image

AP: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతం, క్యాచ్‌మెంట్ ఏరియా, పాల ఫ్యాక్టరీ, కండ్రిక, సింగ్ నగర్ సహా ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చౌహాన్‌కు మంత్రి లోకేశ్ వివరించారు. అనంతరం CM నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. కాసేపట్లో వరద నష్టంపై అధికారులతో చౌహాన్ సమీక్షించనున్నారు.

News September 5, 2024

BRS సోషల్ మీడియా హెడ్ దిలీప్ అరెస్ట్?

image

TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్, మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను అరెస్ట్ చేసి సీసీఎస్‌కు తరలించినట్లు సమాచారం. కాగా వరదలపై దిలీప్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

News September 5, 2024

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు.