India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో ముంబైలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏసు క్రీస్తు విగ్రహానికి అతి దగ్గరగా చంద్రుడు ఉండగా ఫొటోగ్రాఫర్ కెమెరాతో ఫొటో తీశారు. ఈసారి ఈస్టర్‌కు రెండు రోజుల ముందే మార్చి 29న గుడ్ ఫ్రైడే వచ్చింది. ఏసు క్రీస్తు మరణానికి సంతాపం తెలియజేసేందుకు దీన్ని జరుపుకుంటారు. అందుకే అన్ని పండుగల్లా ఆ రోజు చర్చీల్లో వేడుకలు జరగవు.
హ్యారీ పోటర్ సిరీస్‌లో ఫ్లయింగ్ కార్లు గుర్తున్నాయా? అయితే.. అవి రియల్ లైఫ్‌లో నిజం కాబోతున్నాయి. స్లొవాకియన్ కంపెనీ అయిన క్లీన్ విజన్ ఈ ఎయిర్ కార్స్‌ను రూపొందించింది. తయారీ హక్కులను చైనాకు చెందిన హెబీ జియాన్‌క్సిన్ ఫ్లయింగ్ కార్ టెక్నాలజీ కంపెనీకి విక్రయించింది. 2028 నాటికి ఎగిరే ట్యాక్సీలు బ్రిటిష్ ఆకాశంలో తిరుగుతాయని UK ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్త వచ్చింది.
TG: ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈమేరకు ఆమె ప్రకటన చేశారు. ఎల్లుండి(30న) తామిద్దరం హస్తం పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యల పరిష్కారం సులువు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యే కంటెంట్‌పై అడ్మిన్లు, సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. జాతి, మత, కుల వ్యతిరేకమైన కంటెంట్, అసత్య ప్రచారాలు, ధ్రువీకరించని వార్తలు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి, హింసను ప్రేరేపించే కంటెంట్, పోర్నోగ్రఫీ కంటెంట్, ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
TG: సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడనుండటంపై ఆయన కుమారుడు విప్లవ్ స్పందించారు. ‘కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో నాకు సంబంధం లేదు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్‌లోనే ఉంటా. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంది’ అని ప్రకటించారు. కాగా కేకే పార్టీ మార్పుపై మాజీ సీఎం కేసీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను హీరోయిన్ త్రిష వెల్లడించారు. ‘నా కుటుంబాన్ని ముంబైకి మార్చడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌కి వెళితే దక్షిణాది చిత్రాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకున్న క్రేజ్ దృష్ట్యా హిందీ సినిమాలు వద్దనుకున్నా. అంతేకానీ నా తొలి హిందీ చిత్రం ‘కట్టామిఠా’ ఫెయిల్యూర్ వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదన్న ప్రచారం అవాస్తవం’ అని చెప్పుకొచ్చారు.
AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 25కు వాయిదా వేస్తున్నట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు.
అర్హత ఉండి తమకు ఇంటి స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘టీడీపీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. మా పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. సీఎం జగన్ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
AP: చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని సీఎం జగన్ అన్నారు. ‘బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం. బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం. బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం. అందరూ ఆలోచన చేయాలి. వీరు ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారని మళ్లీ మన ముందుకు వస్తున్నారు? బాబు పేరు చెబితే బషీర్‌బాగ్ కాల్పులు, కరవు కాటకాలు గుర్తొస్తాయి’ అని విమర్శించారు.
400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న BJP ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాషాయ కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 21 నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లోని 16,111 మంది కాంగ్రెస్ నేతలు చేరినట్లు బీజేపీ వెల్లడించింది. వీరిలో ఓ కేంద్ర మాజీ మంత్రి, ఏడుగురు మాజీ MLAలు ఉన్నట్లు పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>
Sorry, no posts matched your criteria.