India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పోలవరం YCP ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ మడకం వెంకటేశ్వరరావు తరఫు లాయర్ వాదించారు. కలెక్టర్ జారీ చేయాల్సిన ఎస్టీ సర్టిఫికెట్‌ను బుట్టాయిగూడెం తహసీల్దార్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, సీఐ గట్టు మల్లుపై ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులకు రిమాండ్ విధించారు.
ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మమతా బెనర్జీపై ‘ఎవరి కూతురో?’, ‘బెంగాల్‌కు సొంత కూతురే కావాలి’ వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ టీఎంసీ నేతల ఫిర్యాదుతో ఘోష్‌పై కోల్‌కతాలోని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసులో సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 21 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి. అందులో ఎక్కడా నా పేరు లేదు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాలలో ఆరింట్లో నా పేరు లేదు. లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు.. మరి ఆ డబ్బు ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్‌ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. తనపై ఆరోపణలు లేకున్నా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ స్వయంగా వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు.
ప్రధాని మోదీ కాన్వాయ్‌కు చెందిన మూడు కార్లకు రిజిస్ట్రేషన్ పొడిగించాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. పదేళ్లకు మించిన డీజిల్ కార్లను 2018లో సుప్రీంకోర్టు నిషేధించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. రెనాల్ట్ ఎండీ-5 మోడల్‌కు చెందిన ఈ కార్లకు 2014లో రిజిస్ట్రేషన్ అయింది. తక్కువ కిలోమీటర్లే తిరగడంతో వీటి రిజిస్ట్రేషన్ పొడిగించమని SPG కోరింది.
భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్‌ల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్‌ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్‌లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.
AP: 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకునే సీఎం జగన్ తన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ‘ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు.. తెచ్చావా? మద్య నిషేధం చేయనిదే ఓట్లు అడగను అన్నావు.. చేశావా? సీపీఎస్ రద్దు ఏమైంది? ఏటా జాబ్ క్యాలెండర్? మెగా డీఎస్సీ? కరెంట్ ఛార్జీల తగ్గింపు? పోలవరం పూర్తి చేస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి’ అని చంద్రబాబు నిలదీశారు.
ఏపీ ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురిని నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్‌మోహన్ మిశ్రా, పోలీసు వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న వీరు.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.
IPLలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా SRH బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మనీశ్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించగా, జయదేవ్ 8 టీమ్స్(KKR, DC, RCB, పుణె, RR, MI, LSG, SRH) తరఫున ఆడారు. అలాగే IPLలో రెండు అత్యధిక స్కోర్లు చేసిన జట్లలో భాగస్వామిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఆరోన్ ఫించ్ అత్యధికంగా 9 జట్ల(RR, DC, పుణె, SRH, MI, గుజరాత్ లయన్స్, పంజాబ్, RCB, KKR)కు ఆడారు.
Sorry, no posts matched your criteria.