India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫార్ములా- ఈ కార్ రేస్ వివాదానికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫైల్‌ను తెలంగాణ సీఎస్ ACBకి పంపారు. దీనిపై విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ క్యాబినెట్ అనుమతితో ప్రభుత్వం గత రాత్రి ఫైల్‌ను ఏసీబీకి పంపింది. ఫార్ములా- ఈ రేస్‌లో అవకతవకలు జరిగాయని, మాజీ మంత్రి KTR అరెస్ట్ అవుతారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన గొప్ప ప్లేయర్ అని, ఆయన్ను మిస్ అవుతామంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఆయన పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతోనే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని కెప్టెన్ రోహిత్ తెలిపారు. పింక్ బాల్ టెస్ట్ ఆడాలని తాను అభ్యర్థించడంతో ఆయన వెనక్కి తగ్గి, ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, ప.గో. జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ MP సంజయ్ సింగ్‌పై గోవా సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశారు. డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారనే స్కామ్‌లో సులక్షణ పాత్ర ఉందని ఇటీవల ఆయన ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆరోపణలు చేశారు. దీంతో ఆమె కోర్టులో దావా వేయగా న్యాయస్థానం ఎంపీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

TG: RRRను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. BRSకు రోడ్లపై కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఉప్పల్ ఫ్లైఓవర్‌ను ఆరున్నర ఏళ్లు అయినా ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్‌ఎస్‌ను నిలదీశారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అసలైన వారు బేడీలు వేసుకోలేదని, రేపో మాపో బేడీలు వేయడానికి పోలీసులు వస్తారని మంత్రి చెప్పారు.

బ్రిస్బేన్‌లో జరుగుతున్న IND vs AUS 3వ టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్‌లో AUS 89-7 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి భారత్ ముందు 275పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. IND బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికి 8/0 వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. BGT 5టెస్టుల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బకాయిలపై ఇంజినీరింగ్, టెక్నికల్ కాలేజీల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత దశల వారీగా చెల్లిస్తామన్నారు. ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిలు ఉండకూడదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

AP: TDP అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఉదయం నుంచి ఛానల్ ఆగిపోగా, ఓపెన్ చేసిన వారికి బ్లాక్ అయినట్లు మెసేజ్ వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. కాగా ఛానల్ హ్యాక్ అయిందా? లేక యూట్యూబ్ బ్లాక్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.

క్యాన్సర్ బాధితులకు గుడ్‌న్యూస్. ఈ వ్యాధికి తాము సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటించింది. ‘రష్యా సొంతంగా mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. పేషంట్లకు వీటిని ఫ్రీగా ఇవ్వనుంది. కణతి వృద్ధిని, దాని సమీపంలో మరో కణతి రాకుండా ఇది అణచివేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది’ అని TASS తెలిపింది. 2025లో ఇది మార్కెట్లోకి వస్తుందని సమాచారం.

TG: అసెంబ్లీలో BRS సభ్యుల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని.. స్పీకర్‌కు ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పారు. పదేళ్ల BRS పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆటో రిక్షాల పన్నులు పెంచారని, కొత్త వాటికి అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు. వివేకానంద ఆరోపణలను వెనక్కి తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.