News December 17, 2024

రేపు కాంగ్రెస్ చలో రాజ్ భవన్.. పాల్గొననున్న సీఎం

image

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై PM మోదీ వైఖరిని నిరసిస్తూ రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని TPCC నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగినప్పటి నుంచి PM అక్కడికి వెళ్లలేదని INC విమర్శిస్తోంది.

News December 17, 2024

దేశంలోనే తొలి విమానాశ్రయం.. 150 గమ్యస్థానాలకు విమానాలు!

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్‌పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్ ఇటీవల ఢిల్లీ- డాన్ ముయాంగ్ (బ్యాంకాక్) మధ్య విమానాలను ప్రారంభించడంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది. ఢిల్లీ నుంచి రోజూ 1,400 ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

News December 17, 2024

దొండ కాయలు తింటున్నారా?

image

దొండకాయలను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే శరీరానికి పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే డయాబెటిస్, మూత్రాశయ వ్యాధులు, చర్మ సమస్యలు తగ్గుతాయని, కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయని అంటున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొంటున్నారు. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

News December 17, 2024

నేడు అంబేడ్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు

image

TG: లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నిరసనలు చేపట్టాలని BRS శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. ఉ.11 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని, జైళ్లలో నిర్బంధించి అణిచివేత విధానాలను అమలు చేస్తోందన్నారు.

News December 17, 2024

భారీగా తగ్గిన అంబానీ, అదానీ సంపద

image

ఇండియన్ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి డ్రాప్ అయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీ వ్యక్తిగత సంపద గత జులైలో $120.8B కాగా, ఈనెల 13 నాటికి $96.7Bకు తగ్గిందని తెలిపింది. మరోవైపు అదానీ సంపద $122.3B నుంచి $82.1Bకు దిగి వచ్చినట్లు పేర్కొంది. శివ్ నాడార్ సంపద $10.8B, సావిత్రి జిందాల్ సంపద $10.1B పెరిగినట్లు వెల్లడించింది.

News December 17, 2024

నేడు ఏపీలో రాష్ట్రపతి పర్యటన

image

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉ.11.30కి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కూడా హాజరు కానున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఈ ప్రోగ్రామ్ 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, నలుగురికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు. అనంతరం HYDకి పయనమవుతారు.

News December 17, 2024

‘రంగస్థలం’కు భిన్నంగా సుక్కు-చరణ్ కొత్త సినిమా?

image

బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ తర్వాత రామ్ చరణ్ ‘పుష్ప-2’ డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’కు ఇది పూర్తి భిన్నంగా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తారని సమాచారం. రొమాన్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News December 17, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

image

భారత బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ ఇండియన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ క్రికెట్‌లో కొత్త అవకాశాల కోసం రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నారు. 31 ఏళ్ల ఈ యూపీ క్రికెటర్ ఐపీఎల్‌లో CSK (2013), KKR (2016-17), PBKS (2018-19), LSG (2022) జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 80 మ్యాచుల్లో 248 వికెట్లు, లిస్ట్-A క్రికెట్‌లో 50 మ్యాచుల్లో 71 వికెట్లు తీశారు.

News December 17, 2024

బరువు తగ్గాలంటే ఇదే కీలకం!

image

బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేసి, తిండి తగ్గించేసి కష్టపడుతుంటారు చాలామంది. అలా కాకుండా ముందుగా డైట్(ఆహారం)పై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ‘మనం అందించే కేలరీలకంటే ఖర్చయ్యే కేలరీలు ఎక్కువ ఉండాలి. అలా అయితేనే ఒంట్లోని కొవ్వును శరీరం వాడుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారట. వెయిట్ లాస్‌లో 60% పాత్ర సరైన ఆహారం తీసుకోవడంపైనే ఉంటుంది. వ్యాయామం పాత్ర 40శాతమే’ అని పేర్కొంటున్నారు.

News December 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.