India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సచివాలయంలోని బ్లాక్-1లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి, ఏ శాఖ అప్పగించాలనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పవన్, నాదెండ్ల, దుర్గేశ్ మంత్రులుగా ఉండగా నాగబాబుతో నాలుగో స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

TG: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిషేధించారు. ఈ మేరకు అసెంబ్లీలో నో ఎంట్రీ బోర్డులు దర్శనమిచ్చాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు తీయొద్దని మీడియాను కూడా ఆదేశించారు. దీనిపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు విజయవాడలో ఆందోళనకు దిగారు. గాంధీనగర్ అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు 50 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. వీరి దీక్షకు AISF మద్దతు తెలిపింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. జపాన్‌లో వచ్చే నెల 3వ తేదీన రిలీజయ్యే ‘కల్కి’ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని ప్రభాస్ వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

TG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీలో భట్టి వెల్లడించారు.

AP: వైసీపీ నేత సజ్జల భార్గవ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 13 కేసుల్లో 9 కేసులకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు ఈ కేసులపై అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అల్లు అర్జున్ వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు నందు 7 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతడిని తలచుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘నువ్వు చనిపోయి 7 రోజులైంది. ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి. నువ్వు గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధను జీవితాంతం మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ మిస్ యూ నందు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. రాహుల్(33*), రోహిత్ (0) క్రీజులో ఉన్నారు. ఇవాళ ఆటకు వాన ఆరు సార్లు అంతరాయం కలిగించింది. కాగా తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.

TG: అప్పులపై అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను ఆర్థికమంత్రి తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై BRS సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతించాలని స్పీకర్‌ను కోరినట్లు KTR తెలిపారు. రాష్ట్ర అప్పు రూ.3.90 లక్షల కోట్లు ఉందని RBI చెబితే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్లు అని చెబుతోందని ఆయన మండిపడ్డారు.

టాలీవుడ్‌లో రిలీజయ్యే మెయిన్ సినిమాల్లో హీరోలు వేరైనా హీరోయిన్‌గా మాత్రం శ్రీలీలనే ఉంటున్నారు. అంతలా శ్రీలీల క్రేజ్ పెరిగిపోయింది. నటనతో పాటు డాన్సుల్లోనూ అదరగొడుతున్న ఈ భామ వైపే డైరెక్టర్లు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఆమె రాబిన్‌హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్‌సింగ్, SK25 సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య, అఖిల్, నవీన్ పొలిశెట్టి, సిద్ధూ సినిమాల్లోనూ ఆమె నటించనున్నారు.
Sorry, no posts matched your criteria.