India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజాశాంతి పార్టీకి కామన్ గుర్తుగా హెలికాప్టర్ గుర్తు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 19న ఈ విషయంలో ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన పిటిషన్‌లో తెలిపారు. తమకు కామన్ సింబల్ ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని కోరారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం, ఈసీ కౌంటర్ పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంటూ ఈ నెల 27కు విచారణ వాయిదా వేసింది.
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్సెడ్ ఆయుధాలు కలిగిన ఉన్నవారందరూ వాటిని వారి సమీప పోలీసు స్టేషన్లో సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా సూచించింది. ఎన్నికలయ్యేవరకు కొత్త ఆయుధాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ వద్ద సమాచారం ఉన్న లైసెన్సుదారులందరికీ పోలీసులు ఈ సమాచారాన్ని పంపుతున్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేలమంది వరకు గన్ లైసెన్సు కలిగి ఉన్నట్లు సమాచారం.
ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కేకేఆర్ జట్టు మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. అయితే, నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ తన 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన ఐపీఎల్ కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలు కావడం గమనార్హం. దీంతో KKRపై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంత డబ్బు పోసి కొనుక్కున్నది ఇలా ధారాళంగా పరుగులిచ్చేందుకా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
AP: ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాను తుది దశకు తెచ్చేశాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా నాన్చుడు ధోరణిలోనే ఉండటం కూటమి ప్రచారానికి స్పీడ్ బ్రేకర్‌గా మారుతోంది. పొత్తులో భాగంగా 8 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీకి ప్రస్తుతం స్పష్టత లేదంటున్నారు పరిశీలకులు. అందుకే ప్రకటనలో ఆలస్యం జరుగుతోందని విశ్లేషిస్తున్నారు.
యూపీలో సుపారీ ఇచ్చి మరీ కన్నతండ్రిని చంపించాడో సుపుత్రుడు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన మహ్మద్ నసీమ్(50) ఓ వ్యాపారవేత్త. అతడికి 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అడిగినప్పుడల్లా తండ్రి డబ్బులివ్వడం లేదని పగ పెంచుకున్న సదరు కొడుకు, ఆయన్ను చంపేందుకు ముగ్గురు కిల్లర్లకు డబ్బులిచ్చాడు. వారు నసీమ్‌ను తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు దుండగుల్ని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
వైజాగ్‌లో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురందీశ్వరి సంబంధీకులు ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపించారు. ‘దీనిపై సీబీఐ సహా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు తీరు దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది. పురందీశ్వరి తనయుడు కూడా ఆ కంపెనీలో వాటాదారుడే. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు మాకు అనుమానాలున్నాయి’ అని సజ్జల పేర్కొన్నారు.
నిన్న రాత్రి జరిగిన SRH, KKR మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగి ఆడారు. ఆయన సిక్సులు కొడుతున్నప్పుడు జట్టు యజమాని కావ్య మారన్ గంతులు వేస్తూ కనిపించారు. అయితే చివరి ఓవర్లో 5 బంతుల్లో జస్ట్ 7 రన్స్ చేయాల్సి ఉండగా ఓడిపోవడంతో ఆమె డీలా పడ్డారు. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
TG: మాదిగల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌ను హెచ్చరించారు. ‘మాదిగలు తనకు అండగా ఉన్నారని చెప్పే రేవంత్, ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తారా? మాదిగలకు న్యాయం చేయమని నేను అడిగితే మాదిగ నేతతో కౌంటర్ ఇప్పించారు. మా జాతిని మోదీ కాళ్ల దగ్గర పెట్టానని విమర్శిస్తున్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే ఎవరికైనా మా మద్దతు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రిషబ్ పంత్ ఎట్టకేలకు నిన్న ఐపీఎల్ మ్యాచ్ ద్వారా గ్రౌండ్‌లో అడుగుపెట్టారు. అతడి సారథ్యంలోని ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, తాను గ్రౌండ్‌లో దిగడమే చాలా సంతోషమంటూ పంత్ ట్వీట్ చేశారు. ‘దేవుడికి, అందరికీ కృతజ్ఞతలు. మళ్లీ ఫీల్డ్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేం అనుకున్న ఫలితం దక్కలేదు కానీ ప్రతిరోజూ మెరుగవుతాం. 100 శాతం కష్టపడతాం. గ్రౌండ్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.
నిన్న హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. కేక్‌పై ‘హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్. లవ్ ఫ్రమ్ అన్నయ్య’ అని రాయించారు. అనంతరం శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కాసేపు ముచ్చటించారు. చిరంజీవి స్ఫూర్తితోనే పరిశ్రమకు వచ్చానని శ్రీకాంత్ పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘శంకర్‌దాదా’ సినిమాల్లో నటించారు.
Sorry, no posts matched your criteria.